నీ కోసమే నేను జ్వలిస్తాను. : - మాణిక్యాలరావు పంచదార్ల
 నా అంతరంగ మథనంలో ఉదయించే
అక్షర ఆయుధాలను సంధించడం కష్టమే
కానీ... నిరంతరం శ్రమిస్తాను.
                                                   
నా ఆశల ఆకాశంలో, నువ్వొక ఉల్కలా
నన్ను నిలువునా దహిస్తూ గాయపరిచినా
నేను పరవశంగా సహిస్తాను.
 
నిరాకార వాదం నాది
కానీ ప్రతిక్షణం
నీ రూపమే ధ్యానంగా భావిస్తాను.
 
నువ్వు నిన్నటివి, నేను రేపటిని
కానీ
చీకటిని చీల్చే ఉషోదయ కిరణంలా
నీ కోసమే నేను జ్వలిస్తాను.

కామెంట్‌లు