శివా అను : - డా.సి. వసుంధర
 శివ భావన లేని మనిషి శవమే.
శంకరపాదము తాకని కరము 
 కట్టేతో సమము
శివతత్వము నెరుగని
జ్ఞానము  శూన్యము.
మనిషి మహనీయుడ య్యే మార్గం,అదేభవునీ సందేశం.
నీకెంత కలిగినా
నిరాడంబరమే అసలైన ఆభరణం. నాగభూషణం.
అదే శివాలంకరణా
పరమార్ధం.
కాశీకి పతీవి!నీచేతిలో ఎందుకు
బిక్షాపాత్ర?
అదే రాజ్యాధిపతికి
ఆస్తి
అసలు నీ స్థితి. అదేతెలుసుకో  అంటున్నాడు రాజులను ఆ ఆది
భిక్షుపతి.
మన్మధునికి లొంగకు 
అవస్తలతో
క్రుంగకు
ఆలిని గౌరవించు
ఆర్తుల నాదు కొనుము,
విశ్వ విషయాలపై
విరక్తి, విభూతితో
ముక్తి పొందు.
అమృతమందరికి రుచే
గరళం తినడమే
 గదా శ్వేతవర్ణుని గొప్ప.
 జ్ఞాన శ్రీ కి ఇవ్వు నీలో చోటు
 అజ్ఞాన శ్రీ (విషం)


 ని 
నిలువరించు 
కంఠంలోనే అంటున్నాడు  
శ్రీకంఠుడు.
 
అమ్మ గిరిజ వరించేవచ్చే. శివయ్యమెచ్చే,అమ్మ తపస్సు.
ఇచ్చే అమ్మకు మాంగల్య భాగ్యము అదే మనందరి హృదయానంద,నేత్రానంద,
పరమానంద పరిణయ వైభవము  పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము.
శివరాత్రి భక్తుల పాలి 
 ముక్తి ప్రధాత్రి.
🩸🔕🔕🔕🔔
కామెంట్‌లు