శిశిరానికి వసంతం ఎదురు!: - డా పివిఎల్ సుబ్బారావు.- విజయనగరం.


ఆశయాలు, స్వప్నాలై వస్తాయి! 
స్వప్నాలు, ఆశలు కల్పిస్తాయి! 
సాధన తో సఫలం, అవుతాయి! 
కలలు, కల్లలు కావనిపిస్తాయి!

అల లేచి, పడి ,పడి లేస్తుంది! 
కల చిరిగి చిగురై వస్తుంది!
మోడులా ఎదురుచూస్తుంది!
తన చిగుళ్లకళ్ళు తెరుస్తుంది!

విధి వక్రిస్తే కల చెదురుతుంది!
మరో కల జీవితాన కళతెస్తుంది!
పైలెట్ కల చిరిగినా కలాం గారు!
మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా!
                         
కల కలతగా మిగలరాదు! 
కలకలానికి కారణం కారాదు! 
కలలు, జీవన సాగర అలలు! 
వస్తూ పోతూనే, ఉంటాయి! 

చిరిగిన కలలు వేసే చిగుర్లు !
 కంట మెరిసే, ఆనంద భాష్పాలు! 
 చేత పూసే, పారిజాత పుష్పాలు!
 నిద్రకి, హంసతూలికాతల్పాలు!
_________
కామెంట్‌లు