లేత ఆకుల అందాలు
పోత పోసిన కుప్పలా
కోటి కాంతులీనగా
నింగిని సాగే మబ్బులన్నీ
తొంగి చూసి సోయగాన్ని
రంగుల హంగుకు మురిసి
వంగి వందనమనగా...
ఆకులు అల్లిన చీర కట్టి
పువ్వుల నగలు పెట్టుకుని
పసిడి కాంతుల మెరిసే
ప్రకృతికాంత....
సిగ్గుపడి తలవంచి
దీవెనలు ఇమ్మని
పాదములంట కోరిన
కొత్త వధువులా తోచగా..
నవ జీవన కాంతులు
జన జీవనమున నిండగా
తన కరుణను ప్రసరించ
తరలి వచ్చు తరణికి
🌹🌹సుప్రభాతం 🌹🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి