ఏటి నీటిలో ఎర్రని మంట
అడ్డు పడిన మేఘమంట
ఆగనంటున్న ఆత్రమంట
ఊగిపోదా రెల్లు పంట!
ఆపితే ఆగునా వెలుగు
మబ్బు తనకు తానే తొలగు
నింగిని నిండే రంగులు నీట
తొంగి హంగులు చూసుకోవా!
సువర్ణ రేఖలై కిరణాలు
సవర్ణ కాంతులతో ధరణిని
పరిపూర్ణంగా పరచుకుని
వర్ణమయం చేసె కాదా!
తెలివెలుగుల తొలి సంధ్యలో
మెలమెల్లగా మేలుకుంటూ
కలయ చూసిన జగతికి
కమనీయమగు దృశ్యమే కదా!
వేకువకై వేచి నిలిచి
దోసిట పువ్వులు నింపి
నయన ద్వారములు తెరచి
నీకై వేచిన హృదయాలకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి