నకిరేకల్ విద్యార్థిని మార్మోజు వీణకు M.Tech లో స్టేట్ సెకండ్ ర్యాంకు


 నకిరేకల్ లోని సంతోష్ నగర్ కు చెందిన మార్మోజు విజయ- క్రీ.శే రఘురాములు గార్ల కూతురు మార్మోజు వీణ కు M.Tech  ప్రవేశ పరీక్ష లో రాష్ట్ర సెకండ్ ర్యాంకు సాధించింది , ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి 
ఈ అమ్మాయి 1-10 వ తరగతి వరకు నకిరేకల్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో చదివారు, ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కళాశాల లో, B.Tech ఉస్మానియా యూనివర్సిటీ లో చదివి, అత్యుత్తమ ప్రతిభతో ఈరోజు వెలువడిన M.Tech ప్రవేశ పరీక్ష ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించినందుకు గాను, వారి తల్లి విజయ మరియు అన్నయ్య నిఖిల్, మరియు సంతోష్ నగర్ కాలనీ వాసులు  మార్మోజు వీణ కు అభినందనలు తెలిపారు ,వాళ్ళ నాన్న గారు కరోనా సమయం చనిపోయినా కూడా చదువులో మాత్రం ఎంతో పట్టుదలతో,మనోధైర్యం కోల్పోకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు పలువురు అభినందనలు తెలియజేశారు
కామెంట్‌లు