అసూయ : - P. కీర్తన9వ,తరగతి -జడ్పీహెచ్ఎస్ బాయ్స్ బెజ్జంకి-జిల్లా సిద్దిపేట -చరవాణి 8008798036
 

ఉమా,రమేష్ భార్యాభర్తలు వీరిది రంగాపురం.వీరికిఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఈమె పేరు స్వాతి ఈమె 10వ తరగతి చదువుకుంటుంది. ఇద్దరు అన్నలకు వివాహమైంది.గుగ్గిళ్ళలో పెద్దకొడుకు కోడలు రాజు రమ్య ఉంటారు .. చిన్న కొడుకు శరత్ లావణ్య చిల్లాపూర్ లో ఉంటారు.
 పెద్ద కొడుకు ఇంటి ప్రక్కన ఇంట్లో కవిత సురేష్ ఉంటారు. వారికి ఒక కూతురు మల్లి. చిన్నది చదువుకుంటూ ఉంటది.కవిత చాలా మూర్ఖురాలు ఎవరు కలిసి ఉన్న ఆమెకు నచ్చదు. చాడీలు చెప్పడం ఒకరికొకరికి పోట్లాటలు పెట్టించడము ఏది చూసిన అసూయపడేటటువంటి మనస్తత్వం కలిగింది. ఉమా ఒకసారి పండక్కి తన పెద్ద కొడుకు దగ్గర కు వచ్చింది. కోడలు రమ్య అత్త ఉమ ఇద్దరు కలిసిమెలిసి ఉండి పనులు చేసుకుంటూ హాయిగా సంతోషంగా ఉండడం పక్కింటి కవితకు నచ్చలేదు. ఈలోపు అత్త వచ్చింది కదా అని చిన్న కొడుకు కోడలు కూడా అన్నయ్య దగ్గరికి వచ్చారు. ఇక లావణ్య రమ్య ఉమా కలిసి బయటకు వెళ్లడం నవ్వుకుంటూ ఇంటి పనులు చేసుకోవడం అవన్నీ చూస్తే ఇంకా కవిత లోపట అసూయ పెరిగిపోయింది. ఎలాగైనా ఈ అత్త కోడళ్ళకు కొట్లాట పెట్టించాలి అనుకుంది.
 అలా రమ్య ఉమా పనులు చేసుకుంటున్న సమయంలోపట లావణ్య బయటకి ఎటో వెళ్తూ ఉంటే ఆమె వెనుకనే కవిత వెళ్లి లావణ్య లావణ్య అని పిలిచింది ఏంటి కవితక్క అంత బాగున్నారా అని లావణ్య మాట్లాడింది ఆ మేం బాగున్నాం కానీ నువ్వు వచ్చిన తర్వాత మీ అక్క అత్త ఇద్దరు నవ్వుకుంటూ నీతో మాట్లాడుతున్నారు కానీ అంతకు ముందు నీ గురించే మాట్లాడారు నువ్వేమీ పనులు చేయవంట వట్టిగనే పడుకుంటావంట ఆ భర్తను సరిగ్గా చూసుకోవట అత్తమామలకు మర్యాద తీయవట ఇల్లు శుభ్రం చేసుకోవటం అని చెప్పింది మీ అత్త అని కవిత అన్నది లావణ్య మనసు చివుక్కు మన్నది. అయ్యో అలా అన్నారా అని చెప్పేసి ఏదైనా మాట్లాడకుండా వచ్చేసింది. లావణ్య మనసులో బాధపడుతుంది సమయం చూసి అతను అడగాలి అని చెప్పి సమయం కొరకు చూస్తుంది.
రెండు రోజుల తర్వాత అత్త ఒంటరిగా ఉన్న సమయంలో చూసి అత్తా మనం కవిత దగ్గరికి వెళ్దామా మీరు నన్నేమో అన్నారట అని చెప్పేసి అంటుంది లావణ్య.
 లావణ్యా నేను నిన్ను ఏమన్నాను  ఎప్పుడైనా అన్నానా అని అంటుంది ఉమా అత్త నాకు ఆ కవిత చెప్పింది ఒకసారి మనం కవిత వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగుదాం రా అని చెప్పేసి తోలుకొని వెళ్తుంది.
కవిత ఇంట్లో మల్లి చదువుకుంటుంది.కవిత కవితా సంతోషంగా ఇంటికి ఆటలాడుతూ వస్తూ ఉంటుంది కూతురు అడుగుతది అమ్మ ఏం సంతోషం బాగా ఉంది ఏం సంగతి ఏం జరిగింది అని ఏం లేదే నాకు నచ్చిన పని ఒకటి జరిగింది నీకేం  కావాలి నీకేం అవసరం అంటుందితల్లి.అప్పుడు కూతురు అనుకుంటుంది మా అమ్మ ఏదో కాని పని చేసి వచ్చింది మళ్ళీ ఎక్కడో దెబ్బతింటుంది కానీ అని మనసులో అనుకుంటుంది అమ్మకు ఎన్నిసార్లు చెప్పినా తప్పు చేయొద్దు అని చెప్పిన వినట్లేదు ఒకసారి జరగాలి జరిగితేనే వింటుంది అని కూతురు మనసులో అనుకుంటుంది  ఈలోపు  కవిత అని పిలుస్తూ ఉమా లావణ్య ఇద్దరు వస్తారు అమ్మ మల్లి కవిత లేదా అని అడుగుతే పిలుస్తాను అని అమ్మ అమ్మ అని పిలుస్తుంది. కవిత వస్తుంది కవిత నువ్వు మా అత్త నీకు ఏమని చెప్పింది నువ్వు నాకు చెప్పావుగా ఆ మాటలు ఒకసారి ఇప్పుడు చెప్పు అంటుంది లావణ్య ఒకసారి భయంగా దిక్కులు చూస్తూ గతుక్కుమంటుంది 
 ఏం చెప్పాను ఏం చెప్పలేదు అంత బాగానే చెప్పాను   ఏం బాగా చెప్పావు నాతో చెప్పిన మాటలు అత్తా ముందట చెప్పు అని గట్టిగా తమాయిస్తోంది లావణ్య.
అప్పుడు ఉమా అంటుంది నువ్వు మా చిన్న కోడలికి చెప్పావట కదా గయ్యాలి దాన్ని ఏ పని చెయ్యదు ఇంట్లోనే ఉంటుందని అత్త మామను గౌరవించాలని భర్తకు మర్యాద లేదని అన్ని పుట్టించి చెప్పావట  ఇది మంచి పద్ధతి అబద్దాలు చెప్పి కొంపలు కూలుస్తావా ఏదో ఇంటి పక్కన ఇల్లు కలిసిమెలిసి ఉంటాం కదా అని నీతో మంచిగా మాట్లాడాను కానీ నువ్వు ఇలాంటి దానివని తెలవదు ఇలా నాకు నా కోడళ్ళకు కొట్లాట పెట్టించి దూరం చేస్తావా మీ అత్తకు మీ భర్తకు చెప్పాల పంచాయతీ పెట్టించాలా అని గట్టిగా ఉమా అడిగే వరకు తప్పయింది ఉమా అత్త 
 లావణ్య మీ అత్త కోడండ్లు ఉంటే నాకు నచ్చలేదు నేను అబద్ధం చెప్పాను కానీ మీ అత్త నీ గురించి ఎన్నడు నాకు ఏమి చెప్పలేదు అని నిజం చెప్పి తప్పుకుంది కవిత లావణ్య నన్ను క్షమించు అని అంది కవిత ఉమత్తకు కాళ్లకు దండం పెట్టి అత్తా నీలాంటి అత్త వాళ్ళు ఉంటే కోడళ్ళ కష్టాలు రావు అత్తా కోడలు కలిసిమెలిసి ఉంటారు. మీరు నీ కోడలతో తల్లి బిడ్డ లాగా ఉంటావు చాలా సంతోషం అత్త నా బుద్ధి కూడా మార్చుకుంటాను అని అంటుంది కవిత బిడ్డ కూడా చెబుతుంది అమ్మ ఇలాంటి పనులు చేయకు అమ్మ నీకు కాకుండా మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది మంచి పేరుతో బ్రతకడం ముఖ్యం నలుగురికి సహాయం చేస్తూ బ్రతకడం మనలను దగ్ధం చేస్తుందమ్మా. ఈర్ష ఆశయాలు మంచివి కావమ్మా చెప్పిన బిడ్డ మాటలు విని ఇక నేను అలాంటివేవీ మనసులో పెట్టుకొని అందరిలో మంచితనాన్ని చూసి నడుచుకుంటాను అని చెప్తుంది.
నీతి :ఒకరు చెడిపోవాలని కోరుకుంటే మనకే చెడు ప్రాప్తిస్తుంది అందుకే అందరిలో మంచిని కోరుకోవాలి.
కామెంట్‌లు