రాధమ్మ దైర్యం: - V.రిషిక-7వ,తరగతి -ZPHS బాయ్స్ బెజ్జంకి-జిల్లా:సిద్దిపేట -9441744333
 వీరాపురంలో రాజవ్వ రాజయ్య అనే దంపతులు ఉండేవారు.వారు వ్యవసాయం చేస్తూ బ్రతికే వారు.వ్యవసాయంతో పాటు పాడి పశువులు కోళ్ల పెంపకం చేసేవారు.
ఒకరోజు రాజయ్య వ్యవసాయం చేస్తే ఇంటికి వచ్చేటప్పుడు కాలుజారి ఒక మడుగులో పడ్డాడు అది చూసి చుట్టుపక్కల వాళ్ళు రాజేను లేపి కూర్చోబెట్టి రాధమ్మకు ఈ విషయాన్ని చేరవేశారు ఆ మాట వినగానే రాధమ్మ ఏడుస్తూ వచ్చింది రాజేని నిలబెడితే కాలు నిలబడటం లేదు ఎలాగో ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకుని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళింది డాక్టర్ గారు రాజయిని పరీక్ష చేసి ఇతనికి కాలు విరిగింది రాడ్ వేయాలని దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుందని  చెప్పాడు రాధమ్మ చాలా బాధపడుతుంది అయ్యో ఎలా 5 లక్షలు ఎలా తీసుకురావాలి ఈయనకి ఎలా ఆపరేషన్ చేయించాలి ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలని ఏడుస్తూ కూర్చుంది అటు చూస్తే రాజయ్య కాలు విరిగిపడి ఉన్నాడు ఇటు చూస్తే డబ్బు కావాలి అటు వ్యవసాయ అవసరాలు కూడా ఉన్నాయి.అక్కడే ఉన్న దేవుడికి దండం పెట్టుకొని భగవన్తా నాకు ధైర్యాన్ని ప్రసాదించు ఈ కష్టాన్ని గట్టెక్కించే పరిస్థితిని నాకు కల్పించు అని మొక్కుకుంది. చుట్టుపక్కల వారు రాధమ్మకు ధైర్యం చెప్పారు రాధమ్మ ఎక్కడైనా డబ్బు అప్పు తెచ్చుకొని రాజయ్యకు ఆపరేషన్ చేయించు ఆ తర్వాత మెల్లమెల్లగా అప్పు తీర్చుకుందువు గాని అని ఉపాయాన్ని చెప్పారు. అప్పుడు రాధమ్మ మనసులోనే ఇలా అనుకుంది భయపడుతూ కూర్చుంటే ఏమి చేయలేను ఏదో ధైర్యం తెచ్చుకొని కష్టాన్ని మంచి బయటపడాలి అనుకుంది అప్పు తీసుకొని వచ్చింది కాలు ఆపరేషన్ చేయించి 15 రోజులు ఆస్పత్రిలోనే ఉండి రాజయ్యను డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకొని వచ్చింది. దిగులుగా కూర్చుని తను కళ్లనీళ్లను పెట్టుకున్నది. అప్పులు తీర్చాలి వ్యవసాయం చేయాలి ఎవరు సహాయం తీసుకోవాలి అని అనుకున్న సమయంలోపట దూరపు బంధువు తమ్ముడి వరుస లక్ష్మణ్ ఇంటికి వస్తాడు బావగారిని చూడడానికి అక్క బాధను చూసి అక్క బావ బాగుపడడానికి ఒక ఆరు నెలలు పట్టొచ్చు నువ్వేం కంగారు పడకు బెంగ పెట్టుకోకు నీకు సహాయంగా నేనుంటాను పంట వేసుకొని అప్పు తీర్చుకుందాం అని మాట ఇస్తాడు.
అప్పుడు రాధమ్మ మనసులోనే భగవంతునికి దండం పెట్టుకొని అయ్యా భగవాన్తా నాకు సహాయానికి వచ్చావా!
 సరే తొందరగా పండే పంటలు కూరగాయలు పండించి కొంత కొంత అప్పు తీరుస్తాను తమ్ముడు సహాయం తీసుకుని అని అనుకుంటుంది మనసులో.
తమ్ముడు లక్ష్మణ్ సహాయంతో పొలం దున్ని కూరగాయల సాగు ఆకుకూరలు పండిస్తారు రోజు రాధమ్మ ఊర్లో అమ్ముతుంది లక్ష్మణ్ కూరగాయలను ఆకుకూరలను కరీంనగర్ మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకొని వస్తారు కొంత కొంత డబ్బు పోగు చేస్తూ అప్పు కడతారు రాజయ్య మందులకు కూడా  ఉపయోగిస్తారు
 అలాగే రాజయ్యకు కూడా ఫిజియోథెరపీ చేయిస్తూ శ్రద్ధ తీసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు. రాధమ్మ లక్ష్మణ్ ఐదో నెల వరకు రాజయ్య కొంచెం కొంచెం నడుస్తాడు అమ్మ నేను ఈ కష్టం నుంచి గట్టెక్కగలుగుతాను కష్ట సమయంలో ఆదుకున్న తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. రాజయ్యగూడ కట్టె పట్టుకొని మెల్లమెల్లగా పొలం పనులు చూసుకోవడానికి వస్తు తొందరగానే కోలుకుంటాడు రాధమ్మ సంతోషానికి అవధుల్లేవు కూరగాయలు ఆకుకూరల పంటలతో మంచి రాబడిని పొంది 
అప్పును తీర్చి సంతోషంగా ఉన్నారు రాజయ్య రాధమ్మలు..

నీతి:
ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అధైర్య పడకూడదు అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని  సాధించగలుగుతాము.

కామెంట్‌లు