.ఆకుకూరలు: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-ZPHS:బక్రిచెప్యాల-9704865816
  • కూరలండి కూరలు 
    • ఆకుకూరలు 
    • ఆకుపచ్చ ధనము తోడ 
    • అందంగుండును

    • తోటలోన ఆకుకూర 
    • పెంచాలండి
    • అమ్మకానికి తొందరగా 
    • అందుచుండును

    • ఆకులన్ని పెద్దగా
    • అవ్వగాను
    • అంగడికి తేవాలి 
    • అమ్మకానికి

    • వీటిలోన పోషకాలు 
    • మెండుగుండును 
    • విటమిన్లు విరివిగా 
    • దొరుకు చుండును

    • పొయ్యిమీద తొందరగా 
    • ఉడికిపోవును 
    • ఆకుకూర తింటెను
    • త్వరగ అరుగును

    • ఇంటి చుట్టు ఖాళీ 
    • స్థలముయున్నచో 
    • ఆకుకూర విత్తనాలు 
    • చల్లాలండి

    • వృధాగ పోయె నీళ్లను 
    • పంపాలండి 
    • సమృద్ధిగ ఆకుకూర 
    • వచ్చునండి 

    • ఇండ్ల డాబాల పైన 
    • ఖాళీ స్థలములున్నను 
    • మూరలోతు మట్టి బోసి 
    • మడులు చేయము

    • నాణ్యమైన ఆకుకూరలు 
    • మనకు అందును
    • మన కూరలు మనమేను 
    • పండించాలి.

    • మనచేతిలో ఆరోగ్యం 
    • మనదేనండి.
    • డబ్బు ఆదా అవునండి 
    • ఆలోచించుడి.

    కామెంట్‌లు