శ్రీరాముడు రాజవీధులను దాటుచు మహారాజు ప్రాసాదమును ప్రవేశించుట
---------------------
రథముపై ఆసీనుడై సాగుచుండెను
నా, నా జనములతో దర్శనీయమున
పురవీధులన్ని కళకళలాడుచుండెను
శ్రీరాముడు వారందరిని తగిన విధముగా
ఆధరాభిమానములతో గౌరవిస్తూ
అంతఃపురంలోకి వెళ్లుచుండెను
అతడు తన ఉన్న ప్రదేశము దాటి
చూపులకందనంత దూరముగా
రాముడు వెళ్తుంటే ప్రజలు ఆనందించారు
రాముని చూడని వారు దురదృష్టవంతులు
అనుకుంటూ ప్రజలు ముచ్చటిస్తున్నారు
నాలుగు వీధుల కూడళ్ళను దాటి
రాముడు రాజమందిరము చేరును
శ్రీరాముడు మనోహరమైన మేని కాంతితో
తండ్రి దశరథుని గృహమునకు ప్రవేశించెను.
ఆ భవనాలన్నీ దేవేంద్రుని భవనములా
ఎంతో వైభవగముగా విరాజిల్లుచున్నవి
రాముడు అంతఃపురమున ప్రవేశించినాడు
అందరిని వేలపలనే యుంచి వెళ్ళినాడు .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి