నా తండ్రిని ఏమైనా మాటలంటివా
ఆయనకనుకూలముగా యుండుటయే
ప్రతి ఒక్కరము ఉండదగిన కర్తవ్యము
ఓ! రామా! మీ తండ్రికి ఏ కోపము లేదు
ఆయనకు శారీరకమైన, మానసికమైన
బాధ లేదు అతనికేదో కోరిక యున్నది .
అందుకని నీవేమందువోనని భయము
ఆయనకు నీవెంతో ప్రియమైన వాడవు కదా!
అప్రియవచనములు నీకు తెలుపుటకు
మీ కన్నతండ్రికి నోరాడుటలేదు
ఆయన నాకు వరములిచ్చి యున్నాడు
ఆ వరములు నీ వల్లనే సాధ్యమవును
రామ!ఇచ్చట సత్యపాలనే ధర్మం కదా!
ఆ సత్య ధర్మమును ఉల్లంఘించుటకై
నాపై రుస రుసలాడుచున్నాడు .
రాజు నాకిచ్చిన మాట నీ వలన తీరును
నీవు ఆది పాటించుటకు సిద్ధమైనచో
నేను వరముల గూర్చి నీతో తెలిపెదను
అతని నోట నీకు తెలుపగ లేడు రామా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి