20వ సర్గ : - ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట
అమ్మా! నాకు గొప్ప ముప్పు ఏర్పడినది 
అది ఏమిటో నీకు తెలియకపోవచ్చు
ఈ వార్త నీకూ,సీతకు బాధ కలిగించును 
ఐనను నేను నీకు తెలిపెదనమ్మా



దండకారణ్యమునకు వెళ్ళుచున్న నాకు 
రత్నాసనముతో పని ఏమిటమ్మా 
నేను దర్భాసనముపై కూర్చుండే 
సమయము ఆసన్నమైనది తల్లీ!

నేను రాజాభోగములను త్యజించి 
కందమూలములను తినుచూ 
మునులవలె నిర్జవమైన వనములో 
పదునాలుగువత్సరములు నివసించాలి 

పుత్రిని నోట మాటలు విన్న కౌసల్యాదేవి 
తీవ్రమైన దుఃఖముతో మూర్చనొందెను
తల్లిని శ్రీరాముడు చేతితో నిమిరెను 
ఆ తల్లి బాధతో రామున్ని ఇలా అంటుంది.

"నాయనా! రామా! నీవు నాకు జన్మించకున్న 
నాకు పుత్రఎడబాటు శోకము యుండకపోవును
సంతానము లేని దుఃఖమే యుండును 
ఏ తల్లికి ఈ బాధ రాకూడదు రామా! 

కామెంట్‌లు