21వ సర్గ : - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
వనములకు వెళ్ళవలదని లక్ష్మణుడు, కౌసల్యాదేవి శ్రీరాముని ఒత్తడి చేయుట 
----------------------------



కౌసల్యాదేవి దుఃఖమును చూసి లక్ష్మణుడు 
"ఓ తల్లి! కౌసల్యాదేవి కుటిలాత్మురాలైన
కైక మాటలు విని రాజ్యాధికారమును 
త్యజించి అగ్రజుడు వనములకు వెళ్ళుట 

నాకును సమ్మతము కాదు మాతా
కుమారా! తల్లికి దుఃఖము కలిగించుటవలన 
అధర్మము ఆచరించి సముద్రుడు 
లోక ప్రసిద్ధమైన బ్రహ్మ హత్య వలన కలుగు పాపముతో 

అతడు నరకయాతనకు గురి ఐనాడు 
నీవు నన్ను దుఃఖము పాలు చేసి వెళ్లినచో 
సముద్రుని వలె నీకును దుఃఖములు ప్రాప్తించును 
కౌసల్యమాత శ్రీరామునితో అలా అంటుంది

పూర్వము మన వంశమునకు చెందిన 
సగరుని పుత్రులు తండ్రి మాటననుసరించి
భూమిని త్రవ్వూచూ మృత్త్యువు పాలైరి
ఓ రామా నీవు వనములకు వెళ్ళవద్దు 

జననీ! ఈ లోకమున ప్రతి వ్యక్తియు 
పితృ వాక్య పరిపాలన చేసి తీరవలెను 
అందుకు విరుద్ధముగా నేను చేయలేను 
తండ్రి మాటను నేను పాటించెదను 

కామెంట్‌లు