ప్రవాస పద్య పరిమళం - 41: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: చిత్రానికి పద్యము 
వర్ణనాంశము:  : జ్యామెట్రీ సిద్ధాంతము 
విషయము: గణితము 

ఛందస్సు : చంపకమాల:



పై సమస్య కు పద్యము: 
అమ్మో..  నాకు గణితమంటేనే ప్రచండ గడం.  అది తప్పించుకునేందుకు ఇంటర్ లో BPC తీసుకుని.. హమ్మయ్య  గణితం పీడ వదిలింది! అనుకున్న. కానీ తానొకటి  తలిస్తే దైవమొకటి తలచి  నట్లు  ..దాదాపు  ఓ 11 ఏళ్లు హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం ( Dy. Thasildar AP Government) తర్వాత US  Green card  తో అమెరీకా లో అడుగేట్టాక మళ్లీ చదువు  .. MS  Comp  Sc  కి Pre requisites గా math courses 
Calculus 1, 2, ? హతవిధీ!! .. చచ్చింది గొర్రె అనుకుని, ముక్కు మూసుకు ఆ  కోర్సులు గట్టెక్కి MS లో అడ్మిషన్ సాధించుకుని  .. ఆ తరువాత అంతా Computing …
 
అదీ నా భయానక గణిత సాంగత్యం. .. అ నేపథ్యములో ఈ పద్యము.
చంపకమాల:
గణితము నాకు ఎప్పుడును గడ్డు సమస్యయె నాడు నేడునున్ 
వణకచు నప్ప జెప్పితిని పంతులు గారి గుణింత పాఠముల్ 
క్షణములు లెక్క పెట్టుచును కాలము జూడగ  గంట మ్రోగగన్ 
గణితపు గండమున్దలచి గద్గద కంఠిగ నిల్లు చేరితిన్   
గుణింత పాఠముల్ = Multiplication problems/tables 
కామెంట్‌లు