57వ సర్గ : - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించుట 




గుహుడు వచ్చేవరకు సుమంత్రుడు 
శృంగబేరపులములోనే యుండెను 
సీతారామ లక్ష్మణులు గంగానది దాటి 
నదితీరమును చేరేవరకు చూస్తూ యుండెను

వారు కనుమరుగైనాక గుహుడు వెనుదిరిగెను
అతడు శృంగబేర పురము చేరవచ్చినాడు
సుమంత్రునికి సీతారామలక్ష్మణుల గూర్చి 
వివరముగా విషయములను తెలిపినాడు 

పిదప సుమంత్రుడు మిక్కిలి దుఃఖించి 
అయోధ్యకు ప్రయాణమై వెళ్ళెను
నగరంలోనికి వచ్చుచున్న అతనిని చూసి 
సీతారాములెక్కడ అని జనులు అడిగిరి
వారితో అతడు ఏమీ పలకకుండా 
 
సుమంత్రుడు ముందుకు వెళ్ళిపోతుంటే 
జనులంతా మిక్కిలిగా దుఃఖిస్తున్నారు 
అయోధ్య వీధులన్నీ చీకటిగా యున్నవి 
సుమంత్రుడు రాజగృహము చేరినాడు 

అచట ఆసీనుడైయున్న మహారాజుకు 
సుమంత్రుడు ప్రణవిల్లినాడు 
శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను 
యథాతథముగా ప్రభువుకు వివరించెను 

కామెంట్‌లు