సీతారామ లక్ష్మణుల గూర్చి దశరథుడు సుమంత్రుని అడుగుట
ఓ సుమంత్రా! ధర్మాత్ముడైన శ్రీరాముడు
లాలనతో, ముద్దు మురిపాలతో
సుఖములలో పెరిగిన వాడు అతడు
దుఃఖమునే తెలియని రఘువరుడు
ఏ చెట్టును ఆశ్రయించి యున్నాడు?
కష్టములను ఎట్లా ఓర్చుకొనుచున్నాడు?
నా రాముడు! ఏమి తిని జీవిస్తున్నాడు?
ఓ సుమంత్రా! నా పుత్రుడు శ్రీరాముడు
దేనిపై ఆసీనుడై ఉన్నాడు?
ఎట్లు శయనించుచున్నాడు ?
అతడు భుజించు ఆహారమేమిటి?
ఈ విషయములను వివరింపుము!
స్వర్గము నుండి బ్రష్టుడైన యయాతి
ఇంద్రుని అనుగ్రహముతో దుఃఖవిముక్తి పొందెను
శ్రీరామునికథాశ్రవణముతో శోకవిముక్తుడనయ్యెద
సుమంత్రుడు మహారాజుకు ప్రణమిల్లి
రాముడు చేతులుజోడించి ఇలా అన్నాడు
ఓ సుమంత్రా! మా తండ్రి ధర్మాత్ముడు
అతనికి నా సాష్టాంగ నమస్కారములు
తల్లి కౌసల్యాదేవికి ప్రణామములు
మేమందరము క్షేమము అని తెలుపుము
అమ్మా! మహారాజును దైవముగా భావింపుము
కైకేయిని కూడా గౌరవింపుము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి