దుఃఖిస్తూ బాధతో ఇలా నుడివెను
రాముడు చేసిన అపరాధమేమిటి?
ఎందుకని అడవులకు పంపినాడు?
కైకేయి తుచ్చమైన దుర్భోధలు విని
ఏమాత్రం ఆలోచించకుండా తండ్రి
చేయరాని పనిని అతడు చేసెను
వనమున మేమిలా కష్టాలపాలైతిమి
మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని
శ్రీరాముని వనములకు పంపుట
నా దృష్టిలో సముచితము కాదు
అందుకని అతడిని తండ్రిగా గౌరవించెను
నాకు సోదరుడైన, ప్రభువైన, బంధువైన
కడకు తండ్రియైన అన్నియును శ్రీ రాముడే
శ్రీరాముని అడవికి పంపుటయే క్రూరకర్మ
అట్టి రాజును లోకమెట్లు మెచ్చుకొనను?
ఓ మహారాజా! బయలుదేరునప్పుడు
లక్ష్మణుడు రాముని వద్ద నిలచియుండెను
శ్రీరాముడు చేతులు జోడించి యుండెను
సీతాదేవి బాధతో రథమును చూస్తూ ఉండెను.
================================
అయోధ్యకాండము నందు 58వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి