సవ్వడి చేసే మువ్వలు మీరు!
రివ్వున ఎగిరే గువ్వలు మీరు!
నిత్య చైతన్య దీపికలు!...
ఎల్లలు కల్లలు ఎరుగని మనసులు!
చెల్లాచెదురుగా తిరిగే వయసులు!
చల్లని చూపుల వెన్నెల వెలుగులు!
మల్లెల జల్లుల మమతల వెల్లువలు!
తేటల తేనియ మాటల మూటలు!
ఆటల పాటల పేటికలు!
ఆట విడుపులు చాలిక ...
బడిబాటల స్వాగతమాలక!...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి