సంకల్పమే శ్రీకారం!
సాధనతో సర్వం సాధ్యం ,
ఆ పైన ప్రాకారం!
కన్న కలలు సాకారం,
చేసే సరి సూత్రం!
మనిషికి దేవుడిచ్చిన,
అద్భుత అంతర్నేత్రం!
తలపెట్టిన కార్యం సఫలం,
సంకల్పమే మూలం!
రామకార్యం ఆంజనేయ,
విజయ ప్రాప్తి!
పాండవ వన అజ్ఞాత,
వాసాల పూర్తి దీప్తి!
స్వాతంత్ర్య సముపార్జన,
దేశభక్తుల స్ఫూర్తి!
కరోనాకాలం వ్యాక్సిన్,
ఆవిష్కారం శాస్త్రజ్ఞుల శక్తి!
భారత సైన్యం ,
ఆపరేషన్ సిందూర్ విశ్వవ్యాప్తి!
యువతలో ,
దేశ ప్రగతి మూలధనం!
వయోజనుల ఓటు,
వినియోగ వివేకం !
వచ్చిన పాలకుల దృష్టి,
జన సంక్షేమం !
నీట్ పరీక్ష నిర్వహణం ,
ఆరోపణల అంతం!
ఉద్యోగులవిధి నిర్వహణ,
అవినీతికి చరమగీతం!
ప్రపంచమంతా యుద్ధం,
శాంతి వికల్పం !
ఉగ్రవాద నిర్మూలన ,
ఉక్కుపాదం దృఢ సంకల్పం!
మంచి పెంచడమే నిత్యం,
మా నవ సంకల్పం !
దానిదే మహాబలం,
చెడుతల దించడం సాధ్యం !
ఏనాడు బతికి బట్ట కట్టదు,
మరి దుష్టత్వం!
జగమంతా జనం ,
శాంతి సంకల్పం చేయాలి !
అసుర ప్రవృత్తి పూర్తిగా,
మనమంతా విడనాడాలి !
అంతరంగం సంపూర్ణంగా,
శుద్ధి చేసుకోవాలి !
అది దైవ నివాసమై ,
వెలుగులు వెదజల్లాలి!
ప్రతి పార్దుడు పోరాటాన ,
విజయుడు కావాలి!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి