గురువు (జ్ఞాన సుగంధం) - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497


రోజు పాఠం వల్లె వేస్తున్నాడు
గురువు 
తానో నిత్యవిద్యార్థై
తరగతి గదిలో
 సమకాలీన సమాజాన్ని
 తన పాఠానికి అన్వయించి చెబుతూ గురువు సామాజిక ఉద్యమకారుడయ్యాడు

చీకటి సమాజాన్ని వెలుగులోకి తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తూ
అక్షర చైతన్యాన్ని 
రేపటి పౌరుల్లో
పాదుగొల్పుతున్నాడు
గురువు అంటే ఉపదేశకుడేకాదు
తాను మనందరికీ తండ్రే కదా!!

కామెంట్‌లు