ప్రతి క్షణం సంతోషం: - - యామిజాల జగదీశ్


 ఒక మనిషి హఠాత్తుగా చనిపోయాడు...!
అతను ఆ విషయాన్ని గ్రహించే సమయానికి, దేవుడు చేతిలో ఒక పెట్టె పట్టుకుని అతని వద్దకు వచ్చాడు...!
దేవుడు : రా కుమారా...! మనం బయలుదేరవలసిన సమయం వచ్చేసింది...!"
మనిషి : ఇప్పుడేనా? ఇంత తొందరగానా? నా ప్రణాళికలన్నీ (Plans) ఏమైపోతాయి?"
దేవుడు : నన్ను క్షమించు కుమారా...!
నిన్ను తీసుకుని వెళ్ళవలసిన సమయం ఇది...!
మనిషి : సరేకానీ నువ్వు తీసుకొచ్చిన ఆ పెట్టెలో ఏముంది?"
దేవుడు :  నీ ఆస్తులు /సామగ్రి...!
మనిషి : ఏంటీ నా వస్తువులా...! నా సామాన్లు, బట్టలు, డబ్బు...అన్నీ ఇందులోనే ఉన్నాయా? అదెలా సధ్యం?
దేవుడు : నేను చెప్పేది శ్రద్ధగా విను. 
నువ్వు చెప్పినవేవీ నీవి కావు...అవి భూమిపై నువ్వు జీవించడానికి అవసరమైనవి... అంత వరకే వాటితో నీ అవసరం...!
మనిషి :  అలాగైతే నా జ్ఞాపకాలా?"
దేవుడు : అవి కాల గమనం...!
మనిషి : నా నైపుణ్యాలా (Talents)?"
దేవుడు : అవి నీ పరిస్థితులకు సంబంధించినవి...!"
మనిషి : అలాంటప్పుడు నా కుటుంబమూ, చుట్టాలూ, స్నేహితులా? వీళ్ళందరి సంగతేమిటి?
దేవుడు : క్షమించు! కుటుంబం, చుట్టాలూ, స్నేహితులు నువ్వు జీవించడానికి మార్గాలు...!"
మనిషి : అలాగైతే నా భార్య, పిల్లలా?"
దేవుడు : నీ భార్య, పిల్లలు నీకు సొంతమైనవారు కారు...! వారు నీ హృదయానికి సంబంధించినవారు.!
మనిషి : అంటే నా శరీరమా?"
దేవుడు : అది కూడా నీకు సొంతమైనది కాదు...! శరీరమూ, చెత్తా ఒకటే...!"
మనిషి : నా ఆత్మ?"
దేవుడు :  అది కూడా నీది కాదు...! అది నాది...!
ఈ మాటతో మనిషి మిగిలిన భయంతో దేవుని నుండి ఆ పెట్టెను తీసుకుని తెరిచిన అతను ఖాళీ పెట్టెను చూసి షాక్‌కు గురయ్యాడు. ఆశ్చర్యపోయాడు...! విస్తుపోయాడు...!
కళ్లలో నీళ్లు కారుతుండగా దేవుడితో
"అంటే నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదా?" అని అడిగాడు కన్నీటిపర్యంతమై...!
దేవుడు, "అదే నిజం !
నువ్వు జీవించే ప్రతి క్షణం మాత్రమే నీది...! జీవితం అంటే నువ్వు దాటే ఒక క్షణమే...! ప్రతి క్షణాన్ని సంతోషం గా జీవించు...! అన్నీ నీవే అని అనుకోకు...! ప్రతి క్షణాన్ని జీవించు...! నీ జీవితాన్ని నువ్వు జీవించు...!
సంతోషంగా జీవించు...! అది మాత్రమే శాశ్వతం...! నీ చివరి రోజుల్లో నువ్వు దేనినీ నీతో తీసుకెళ్లలేవు...!" అన్నాడు.
అందుకే జీవిస్తున్న ప్రతి క్షణాన్ని సంతోషంగా జీవిద్దాం...! కక్షలూ కార్పణ్యాలూ వ్యర్థం.
కామెంట్‌లు