సరిలేరు నీకెవ్వరు.: - డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం.
భారత్ ఆధార్ , కిసాన్!
మేరా భారత్ మహాన్ !
మనం ప్రజలం, ఇన్సాన్ !
రైతన్న, నాదాన్, ఈమాన్!

మనల్ని సృష్టిస్తాడు, ఆ విధాత!
 పోషించే అన్నదాత, ప్రాణదాత! 
స్వధర్మో శ్రేయావః- భగవద్గీత !
జన శ్రేయస్సు, కోరే దేవదూత!

హలధారి,వ్యవసాయసూత్రధారి!
పొల బృందావన,ఆనంద విహారి!
పనిలో, దైవాన్ని చూసే పూజారి!
మనకోసం,బతికే నిత్యసదాచారి!

దున్నే పొలమే, శివలింగం !
స్వేదధారల, నిత్యాభిషేకం !
పండే పంట, దైవ నైవేద్యం !
ప్రసాదం, సర్వజన వితరణం!

మానవ కుటుంబ, పోషకుడు!     
 ఆకలిచీకట్లు, చీల్చే ఆదిత్యుడు! 
 అమ్మ పెట్టే, అన్నానికి ఆద్యుడు ! 
ఇల శ్రేష్టుల, లెక్కిస్తే ప్రధముడు!
__________

కామెంట్‌లు