కోరికల గుర్రాల, కళ్ళాలే సొగసు!
ఆకర్షణల అజేయం, నీ మనసు!
ముందుకు పోవడమే, తెలుసు!
తెరిచిన తలుపు, దారి చూపు!
ప్రతిక్షణం నిన్ను ఉసిగొలుపు!
లక్ష్యం చేరాలి, రానీకు అలుపు!
అలుపు లేక నడిస్తే నీదే గెలుపు!
వేసిన తలుపు మనిషికి పలుపు!
తెరిచిన తలుపు స్వేచ్ఛ పిలుపు!
గడియ తెరిచే ఘడియ మెరుపు!
చీకటి దారి మెరుపులే నడుపు!
బంగారు పంజరం, పక్షి బతుకు!
స్వేచ్ఛ ఒక్కటే, దొరకని మెతుకు!
మనసు తలుపు,తెరిచిన క్షణాన!
మనిషి పక్షిలా ఎగురు గగనాన?
మనసు తలుపు తెలిస్తే, నిర్భీతి!
నిర్భీతే, బతుకు పోరాట రీతి!
కావాల్సింది, నిత్య పోరాట ప్రీతి!
పోరాడితేనే సత్యం,జగతి,ప్రగతి!
__________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి