తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్ర భారతి లో మూడు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. శ్రీమతి నెల్లుట్ల రమాదేవి డి కామేశ్వరి కథలో స్త్రీల విశ్లేషణ,డా. కొండపల్లి నిహారిణి కథా సుజాతం డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి కథలు- సమగ్ర విశ్లేషణ, అభిమానం - పీఠికల సమాహారం అనే పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి ఆవిష్కర్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఐఏఎస్ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు. ఈ సభకు సభాధ్యక్షులు శ్రీ గుడిపాటి గారు దాశరధి పురస్కార గ్రహీత. విశిష్ట అతిథులు డాక్టర్ అమృతలత గారు, శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు . ఆత్మీయ అతిధులు పుస్తకాల పరిచయకర్తలు డాక్టర్ వాణి దేవులపల్లి కథా సుజాత పరిచయం, శ్రీమతి సింగరాజు రమాదేవి డి కామేశ్వరి కథలను స్త్రీల సంవేదనలు పరిచయం, శ్రీమతి అరుణ ధూళిపాల అభిమానం పుస్తక పరిచయం.
ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ రచయిత్రులు ఈ పుస్తకాల రచనల ప్రధాన వ్యక్తులు అయిన డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారు, శ్రీమతి డి కామేశ్వరి గార్లకు సన్మానోత్సవం కూడా జరిగింది. కార్యక్రమానికి తొలి పలుకులు ఆహ్వానం శ్రీమతి రాధిక సూరి అందించి సభకు అందరికీ ఆహ్వానం పలు కుతూ వేదికపైకి అతిథులను ఆహ్వానించారు .
శ్రీ గుడిపాటి గారు సభాధ్యక్షులుగా సభను నిర్వహించగా ప్రారంభ సందేశం ఇస్తూ ఒక్కొక్క అతిథి గురించి క్లుప్తంగా చెబుతూ ఇరువురు రచయితలు డాక్టర్ కొండపల్లి నిహారిణి నెల్లుట్ల రమాదేవి గారు నిరంతరం సాహితీ సేవ చేస్తున్నారని ప్రశంసిస్తూ ఇద్దరు కలిసి మూడు పుస్తకాల ఆవిష్కరణ చేయడం సభ నిండుగా ఉండడం ఆనందకరమని అన్నారు.
పుస్తకాల ఆవిష్కరణ చేసిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రసంగిస్తూ వేదిక మీద ఉన్న అతిధులను గురించి చెబుతూ సన్మానం తీసుకుంటున్న డి కామేశ్వరి గారిని డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారిని వారి సాహిత్యపు సంగతులను ప్రస్తావిస్తూ ఈ రోజున చేస్తున్న మూడు పుస్తకాలు వేటికవి ప్రత్యేకమైన వని అన్నారు. తనదైన శైలిలో విశ్లేషించారు. మచ్చుకు కామేశ్వరి గారి కథను వినిపించారు .
సాధారణంగా నవలాకారిణి అయినప్పటికీ 300 కు పైగా కథలు, 12 సంపుటాలు దృష్టి పెట్టి రాసారు. ముదిగంటి సుజాత గారు అటు తెలుగు సంస్కృత భాష లలో, పరిశోధన లో విశిష్ఠ సేవ చేసారన్నారు. ఆమె కథలలో వస్తుప్రధానం గా రాస్తూ పురుషుల ప్రధాన జీవన భాగంగా ఉంటూ స్త్రీలు తమ అంతరంగం లో తమకు సానుకూలమైన విధానాన్ని ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటారు అన్నారు. అనంతరం డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారి గురించి చెబుతూ అటు ప్రాచీన సాహిత్యాన్ని ఇటు తెలంగాణ సాహిత్య చరిత్ర, తన జీవిత చరిత్ర రాసుకున్నారు. సాయుధ పోరాటానికి చెందిన ఒక కథను తీసుకొని మలుపు తిరిగిన రథచక్రాలని రచించారు, తరువాత ఒక నిమ్న కులస్తుడు అగ్రకులం వాడితో పోటీ పడి ఎదిగితే ఎలా ఉంటుంది అన్నదానిమీద ఒక నవల రాసారన్నారు. ఆకాశంలో విభజన రేఖ అనే నవలలను స్త్రీవాదం సంబంధించి రచించారన్నారు. కొండపల్లి నిహారిణి గారు స్త్రీల కథలు కుటుంబ కథలు సామాజిక కథలు గా తీసుకుని రాసారు. ఈ కథలలో సాంకేతాత్మక పేర్లు వాడటం నచ్చిందన్నారు. ఇలా అనేక అంశాలను స్పృశిస్తూ ఆ పుస్తకాలను గురించి అద్భుతమైన విశ్లేషణను అందించారు.
తొలుత శ్రీమతి డి కామేశ్వరి గారికి సన్మానం చేశారు. డి కామేశ్వరి గారి పరిచయాన్ని కిరణ్ బాల గారు చదివారు.అటు పిమ్మట ముదిగంటి సుజాత గారికి సన్మానం చేసారు రచయిత్రులు అతిథులు. ముదిగంటి సుజాత రెడ్డి గారి పరిచయాన్ని రంగరాజు పద్మజ గారి చదివారు ఈ సందర్భంగా తమ స్పందన తెలియజేశారు డి.కామేశ్వరి గారు మాట్లాడుతూ నెల్లుట్ల రమాదేవి తన కథల మీద రాయడం నచ్చిందని చెబుతూ తనకు 90 సంవత్సరాల అని ఈ 90 సంవత్సరాలలో ఐదు తరాలు చూసానని ఈ తరం ఎలా ఉంటున్నారో వివరించారు. తన కథలను గురించి తను రచించిన నవలలను గురించి ప్రసంగించారు. ఈ పుస్తకం రాయడం నాకు సన్మానం చేయడం సంతోషమన్నారు.
డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సన్మానం స్వీకరించడం సంతోషంగా ఉందని వేదికపై ఉన్న ప్రతి ఒక్కరిని సుజాత రెడ్డి గారు పేరుపేరునా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
కథా సుజాత పరిచయం చేసిన డాక్టర్ వాణి దేవులపల్లి డాక్టర్ కొండపల్లి నిహారిణి గారి సమగ్ర విశ్లేషణను అద్భుతంగా ఆవిష్కరించారు. తనకు కొండపల్లి నిహారినికినిహారిణి కి ఉన్న స్నేహాన్ని కలిసి జీవించిన జీవితాన్ని తెలియజేస్తూ కొండపల్లి నిహారిణి ఆ స్థాయి నుంచి ఎన్నో పుస్తకాలు రచించారని ఎన్నో కోణాలలో రచనలను తీసుకువచ్చారని అన్నారు.
నెల్లుట్ల రమాదేవి గారు రచించిన డి కామేశ్వరి కథలో స్త్రీల సంవేదనలు పుస్తకం గురించి పరిచయం చేస్తూ శ్రీమతి సింగరాజు రమాదేవి గారు కథ అంటే ఏమిటి విమర్శ అంటే ఏమిటి అని మొదలు పెడుతూ డి కామేశ్వరి గారి కథల సంవేదనలను రమాదేవి గారు ఎలా విశ్లేషించారు అన్నది తమ పరిచయంలో వివరణాత్మకంగా వివరించారు. స్త్రీ పురుష సంబంధాలు కుటుంబ సంబంధాలలో కామేశ్వరి గారు స్పృశించని అంశం లేదు అత్యంత నిజాయితీగా నిక్కచ్చిగా బాధ్యతగా ఒక తపస్సుల తనకు తెలిసిన తను పరిశీలించిన విషయాలను చక్కని పాత్ర చిత్రనా సన్నివేశాలు అధికతో కథలుగా మలిచి అందించిన బృహత్కతా మంజరి ఆమె అంటూ కామేశ్వరి గారి రచనలను గురించి వెనుట్ల రమాదేవి గారు రచించారని అన్నారు.
అభిమానం పీఠికల పరిచయం గురించి శ్రీమతి అరుణ దూళిపాల గారు పరిచయం చేస్తూ ఆ పీఠికలను ఎవరెవరు రాశారు వివరించారు. ఇందులో కవిత్వం కథ నవల నాటకం కథ విమర్శ తదితర అంశాలపై పీటికలు ఉన్నాయన్నారు ఈ వ్యాఖ్యానాలను పీఠికలను కఠిన పదాలతో కాకుండా సులువైన వాక్యాలతో కూర్చి రచించారన్నారు.
విశిష్ట అతిధులు డాక్టర్ అమృతలత గారు ప్రసంగిస్తూ పుస్తకాలు వేసుకోవడానికి ఆర్థికంగానూ శ్రమపరంగాను ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తాము రచించిన సీనియర్ రచయిత్రుల గురించిన రచనలను పుస్తకాలుగా వెలువరించిన నెలుట్ల రమాదేవి గారిని డాక్టర్ కొండపల్లి నిహారిణి గారిని అభినందించారు.
మరొక విశిష్ట అతిథి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు మాట్లాడుతూ మూడు పుస్తకాలను పాలపిట్ట అద్భుతంగా తీర్చి దిద్దారని ముఖ్యంగా కొండపల్లి నీహారిణి పుస్తకం మీద కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రాలు, నెల్లుట్ల రమాదేవి గారి పుస్తకం మీద కామేశ్వరి గారి తైలవర్ణ చిత్రం పెట్టడం సంతోషం కలిగించిందన్నారు.
రచయిత్రుల స్పందనలో డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు తాను నిర్వహిస్తున్న మాయూఖ తరుణి పత్రికలతో పాటు డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి కథలు గురించి మాడభూషి లలిత గారు శీలా సుభద్ర దేవి గారు సూచన మేరకు మోనోగ్రామ్ రచించి పుస్తక రూపంలోకి తీసుకువచ్చామని తెలియజేశారు. పుస్తకావిష్కరణకు వచ్చిన వారందరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. తన రెండు పుస్తకాలలో వెలువరించిన అంశాలను తెలియజేశారు.
డి కామేశ్వరి కథలో స్త్రీల సంవేదనలు పుస్తక రచయిత్రి కాళోజీ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు తనకు డి కామేశ్వరి గారి కథలలో కలిగిన అనుభవాలను ప్రత్యేకమైన విషయాలను పంచుకున్నారు. 300 కథలు రాయడం చాలా గొప్ప విషయమని అందులో ప్రతి కథలను వస్తు వైవిధ్యం ఉందని అన్నారు.
శ్రీమతి పద్మశ్రీ చిన్నోజ్వల గారు మలి పలుకులు పలుకుతూ సభకు విచ్చేసిన వారందరికీ సభలో పాల్గొన్న అతిధులకు సభ నిర్వహణకు తోడ్పడిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలతో వందన సమర్పణ చేశారు.
సభాధ్యక్షులుగా వ్యవహరించిన గుడిపాటి గారిని వచ్చిన వారందరూ ఇటీవల దాశరధి పురస్కారం అందుకున్నందుకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముచ్చటైన మూడు పుస్తకాల ఆవిష్కరణతో సాహిత్య సుక్షేత్రంలో మరో మూడు పుస్తకాలు చేరి సుసంపన్నం చేయగా సాహితీ మిత్రుల కలయికతో సభ కళకళలాడింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి