ద్రోహం చెయ్యకు
నేస్తం.
అమ్మంటే బొమ్మ కాదు. ఆమె ప్రతిరూపమే నీవు.
ఆమెను కష్టపెడితే
నిన్నునీవు కష్ట పెట్టుకున్నట్లే.
అయినవారు వద్దనుకుంటే,
వారు పోయిన తర్వాత తిరిగి రారు.ఎవరూ లేని వాడిలాఎంతకాలం బ్రతుకుతావు?
బ్రతికి ఏంసాధిస్తావు.
చెట్టును చూడు
ఒక మెట్టు పైకి ఎక్కు. నీకు
నీడను, తినడానికి పండ్లను, కావలసినవన్నీ ఇస్తుంది.కానీ
నిన్నేమైనా అడిగిందా నీవు నరికేస్తుంటేనవ్వుతూ చూస్తన్నది
నేర్చుకో ఏదైనా ఓర్చుకో. కూర్చుకో
పుణ్యఫలాన్ని.
మంచి మాటలు
మందు లాంటివి
తినేటప్పుడు కష్టమైన
తిన్న తర్వాత
ఆరోగ్యాన్ని అందిస్తాయి.
అందరం కలిసి ఉందాం.
అందులో ఉంది పరమానందం.
స్వ,పర భేదాలతో
సర్వం నాశనం.
ఒక్కడేభగవంతుడు మనుషులుఅందరూ ఒక్కటే.
ఒక్కటే అన్న భావం, ఒక్కటే శాంతిమంత్రం .
ఓంశాంతి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి