హలో పిల్లలూ! మిరియాల చారు బాగా ఘాటుగా ఉంటుంది. జ్వరం జలుబు వచ్చినపుడు అమ్మ పెడుతుంది కదా! ఇంకా పానకంలో, పాలలో మిరియాల పొడి వేస్తారు. మిరియాలు పొదలుగా పెరిగే తీగ జాతి మొక్క. ప్రాచీన కాలం నుండి భారత దేశంలో మసాలా దినుసుగా వాడబడుతోంది. ఇదొక సుగంధ ద్రవ్యమని తెలుసు కదా! అంతే కాదు ఈ మిరియం సుగంధ ధ్రవ్యాలలో రారాణి గా పేరు పొందింది. దీనిని “క్వీన్ ఆఫ్ స్పైసెస్” అని పిలుస్తారు. ఒకప్పుడు భారత దేశంలో అధికంగా పండే పంట ఇది. మిరియాలకు పుట్టిల్లుగా భారత దేశంలోని మలబారు ప్రాంతం. అయినా ఇప్పుడు చాలా చోట్ల పండిస్తున్నారు. మాములుగా మనం చూసే మిరియాలు నలుపు రంగులో ఉంటాయి. కానీ వీటిలో చాలా రంగులు ఉంటాయని చెపితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులలో మిరియాలు ఉంటాయని తెలిశాక నాకు అపూర్వంగా అనిపించింది. ఎర్ర లేటరైట్ నేలలు మిరియాల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇవి తీగ జాతి పంటలు కాబట్టి తీగలు పాకటానికి అనువుగా పొడువైన, బలంగా పెరిగే చెట్లను పెంచుకోవాలి. మార్చి నెలలో గింజలు తయారవుతాయి. మిరియాల పై చర్మం ముడతలు పడేదాకా ఎండలో ఎండ బెడతారు. ఇది ‘పైపరేసి’ కుటుంబానికి,’ పైపరేలిస్’ క్రమానికి చెందినవి. దీని శాస్త్రీయ నామం “పైపర్ నైగ్రమ్”. ఆయుర్వేదంలో మిరియాలను “కృష్ణ మరీచం” అని పిలుస్తారు. ఇదొక వంటింటి ఔషధం.
ఇక్కడ నేను మిరియాలతో గౌను కుట్టాను. తలకు జుట్టు దువ్వి రెండు పిలకలు వేశాను. జుట్టు నల్లగా వేయాలి. కానీ బ్రౌన్ రంగులో వేశాను. ఈనాటి పిల్లలకు జట్టు తెల్ల బడటాన్ని చూపించాలన్న ఆశతో ఇలా వేశాను. బ్రౌన్ రైస్ ను జుట్టుకు పెట్టాను. చేతులు, కాళ్ళకు జీలకర్రను ఉపయోగించాను. మా మీనాక్షికి ముక్కు పుడక పెట్టలేదు. ఈ బుజ్జి తల్లిని ఆశీర్వదించండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి