హవా మహల్! : - అచ్యుతునిరాజ్యశ్రీ


 రాజస్థాన్ లో గులాబీనగరం జైపూర్ లో హవామహల్ సైంటిఫిక్ ఆర్కిటెక్ట్ భారతీయ ప్రతిభకు నిదర్శనం.భయంకర వేడి ఇసుక ఎడారి రాజస్థాన్ లో హవామహల్ చల్లగా ఎ.సి.లాగా ఉండటం అద్భుతం ఆశ్చర్యకరం.1799లో మహారాజా సవాయి ప్రతాప్ సింహ్ నిర్మించాడు.లాల్ చంద్ ఉస్తాద్ దాని రూపకర్త. రాజకుమార్తెల  రాణుల కోసం కట్టారు.లోపల నుంచే కిటికీలగుండా బైట జరిగే ఊరేగింపులు,ఉత్సవాలు ఎంచక్కగా చూసేవారు. ఇందులో 953 చిన్న చిన్న కిటికీలు ఝరకో వల్ల ఆమహల్ చల్లగా ఉంటుంది.హవామహల్ లో వెంచురీ ఎఫెక్ట్ అనే ప్రిన్స్ పుల్ తో పనిచేయడం దాని ప్రత్యేకత. గాలి ఇరుకుప్రాంతంలో  వేగంగా వీస్తే గాలి చల్లబడుతుంది.వందలాది కిటికీలోంచి గాలి వీస్తే లోన చల్లగా మారుతుంది.ఆమహల్ డిజైన్ కూడా వేడి తగ్గేలా గులాబీ ఎరుపు చలువరాళ్లు పగటి వేడిని నెమ్మదిగా అబ్జార్బ్ చేయటంతో త్వరగా వేడెక్కదు. బాగా మందంగా ఉండే గోడలు టెంపరేచర్ని బాలెన్స్ చేసి బైటివేడిగాలిని సరాసరి లోనకు రానీయదు.5అంతస్థుల ఈమహల్ పిరమిడ్ ఆకృతిలో,పై అంతస్తులో చాల కిటికీలుండటంతో వేడిగాలి పైకి పోయి కింద చల్లగా ఉంటుంది.హవామహల్ లోన చిన్న ఇరుకు సందులు,గొందులుండటంతో  చల్లదనంహెచ్చు అవుతుంది.సూర్య దిశను గమనించి పగలు సాయంత్రం సూర్య రశ్మి లోపలకు సరాసరి పడకుండా కట్టిన ఆనాటి నిపుణులకు, కార్మికులకు సదా వందనాలు తరతరాల సంస్కృతికి జోహార్లు🌷
కామెంట్‌లు