సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం


 సామెత -281: ఇంటిపేరు కస్తూరి వారు ఇల్లంత గబ్బిలాల కంపు అన్నట్లు

**
"ఏందోనే అవ్వా! కొన్ని బలే గమ్మత్తుగుంటయ్. కొందర్కి అమ్మ నాయినలు పెట్టే పేర్లకి గాళ్ళు జేసే శకలకి సస్రం ఫరకుంటది.గవి సూత్తుంటె నవ్వొత్తది.కోపమొత్తది.అయ్యో పాపమనిపిత్తది. గీ పెద్దోళ్ళు పేర్లు గట్లెందుకు పెడ్తరో ఏమోనే?"
"గదేందిరా అయ్యా! ఎన్నల్లేంది పేర్లమీద, పెద్దోళ్ళ మీద బడ్డవు. ఎవలైన సరె గాళ్ళ కడ్పున బుట్టిన సంతానం మందిల మంచి పేరు తెచ్చుకోవాలనే గద సూశేది. గాళ్ళు మంచోళ్ళైతరో శెబరోళ్ళైతరో  పెద్దైనంక గద తెల్శేది.మన పక్కింటి కొండయ్య కొడుకు బక్కయ్య.కొండయ్య సూత్తెనేమో  దబ్బనంతో గుచ్చితే అటీటు దిగేంత బాక్కగుంటడు. ఇంగ గాయిన కొడుకు బక్కయ్య బీముని లెక్క దుబ్బుకు దుబ్బే వుంటడు.గాడు శిన్నప్పుడు సోవిడి సోకి బాక్కగుండేటోడు. గంద్కనే గా పేరు వెట్టుకుర్రు.గిప్పుడు సూడు ఆడెట్లున్నడో."
" సూర్యకాంతం అనగానే గామె లెక్క గా పేరు బెట్టుకున్న అందరు గయ్యాళులు అయితరా ఏంది?"
"గంతేనంటవా అవ్వా! నువ్వు జెప్పినట్టు నా దోత్తుగాని పేరు రాజు. గని ఏం లాభం. గానంత పేదోడు ఇంకోడు లేడంటే నమ్ము. గాన్ని శిన్నప్పటి సంది సూత్తున్న. గాని వొయిసు పెర్గింది గని గాడెన్నడన్న సుఖంగ బత్కిండ శెప్పవ్వా!? "
" అవున్రా వారీ! గట్ల పేర్లకీ మన్సులకి లంకె కుదర్దు గాక కుదర్దు.నేను సూత్తున్న గద. ఏంటో గీ యచ్చింత్రాలు. అవున్రా వారీ గియ్యాల గీ యిష్యం ఎందుకు యాదికొచ్చింది ?
 "గదేనవ్వా  గీ నడ్మల మన సొతంత్రం తాత అగుపిచ్చిండు. గాయిన్ని సూత్తే మస్తు బాదన్పిచ్చింది. గాయిన పేరుకి గాయిన బతుక్కి ఏవన్న కల్శిందా? పేర్ల సొతంత్రం దప్ప బత్కుల లేదాయే ముసలోడయ్యే దనుక మనూరి దొర తాన ఎట్టి శాకిరి సేశిండా? గాయిన పిల్లలు ఎద్గినంకైన సొతంత్రం వొచ్చిందా అంటే గదీ లేదాయె. కోడండ్లు బెట్టింది తినాలె.నోర్మూస్కొని వుండాల్నాయె.పాపమనిపిత్తదవ్వా!"
"అవున్రా వారీ! బుద్ధికి తగ్గట్టు పేరు.పేరుకు దగ్గట్టు బుద్ధి ఏ కొద్దిమంది మగానుబావులకో వుంటది.కొందర్ని సూత్తే సత్తానికి నిల్వెత్తు సాచ్చాలు.శీరామ శందురుని పేరు.గట్లనే గా మడిషి తీరు ఉన్నప్పుడు ఎంతదృట్టం అన్పిత్తది."
"అవ్వా! మొన్న! నా దోత్తు మారాజు పట్నంల కలిశిండు.గాన్ని సూత్తుంటే శిన్నప్పుడు టిప్పుటాపుగ ఉండేటోడు.గిప్పుడు సూత్తె పరేషానైతం అవ్వా!"
 ఓ గాడేనారా గా కత్తూరోల్ల అబ్బాయి?"
 "అవునవ్వా!  గాళ్ళ ఇంటి పేరు కస్తూరి వారు.గట్లని శిన్నప్పుడు శెడ్డీలేస్కున్న వొయిసులో గాల్లింటికెల్తే గవులు ఆసనొచ్చేది.ఇంటినిండ యిడిశిన గుడ్డలు. తిన్న బోళ్ళు బొచ్చెల మీద జుబ్బున ఈగలు ఆలుడు. గయి సూశి నాకు శానా త్యేపల డోకే వొచ్చేదవ్వా! గది యాదికొచ్చింది.గిప్పుడన్న  గాళ్ళు మారిండ్రో? లేదో?"
"గస్మంటోళ్ళని సూశే" ఇంటి పేరు కత్తూరి వారు ఇల్లంత గబ్బిలాల కంపు " అని పేరొచ్చిందిరా అయ్యా!"
"గదే అవ్వా! ఇంటి పేర్లకీ,వొంటి పెర్లకీ గా గుణాలకి అస్సలు కల్వదు.ఎవలన్న  ఏ  పేరు వెట్టుకున్నా గొప్పోళ్ళయితరు సూడు.గస్మంటోళ్ళ వల్ల గా పేర్లకే పేరు వత్తది గదవ్వా!"
"అవున్రా వారీ!"
గదండీ సంగతి" "ఇంటి పేరు కస్తూరి వారు ఇల్లంతా గబ్బిలాల కంపు" అంటే గిదే మరి.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం