అంతర్జాల గీతాన్ని ఉపాధ్యాయ రాష్ట్రనేత మంజుల ఆవిష్కరణ


 రాజాం రచయితల వేదిక సభ్యులు, పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల సాంఘికశాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు రచించిన గీతాన్ని, ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల చరవాణి ద్వారా ఆవిష్కరించారు. ఉగాది నేపథ్యంలో పల్లెల్లో ఉండే సందడి గూర్చి తిరుమలరావు పాట ద్వారా రచించి, స్వరకల్పన చేయగా చరవాణి ద్వారా మంజుల ఆవిష్కరించి వినిపించారు. స్థానిక సన్ స్కూల్ ఆవరణలో జిల్లాల పునర్విభజన బదిలీలపై అవగాహన సదస్సును ఎపిటిఎఫ్ నిర్వహించగా, ఆ వేదికపై ఈ దృశ్యగీతం ఆవిష్కృతమైంది. 
అబ్బ దీని తస్సదియ్యా కలకలలాడుతోంది ఊరంతా హంగామా, అదిరా నా సామిరంగా రాములోరి గుడికాడ చెక్క భజన చూద్దామా అంటూ సాగే ఈ మూడు చరణాల పాట, గ్రామీణ తెలుగుదనం పదాలతో జానపదం బాణీలతో రంజింపజేసింది.
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ఇకమీదట యూట్యూబ్ లో ఈ దృశ్య గీతం అందరూ చూసి తనను ఆశీర్వదించాలని కోరుతూ, ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టిన బి.ఎం.గౌరీశ్వరరావుకు మిక్కిలి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె.వేణుగోపాల్, విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్ మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు దవల సరస్వతి, నల్ల బాలకృష్ణారావు, జిల్లా పూర్వ అధ్యక్షులు షేక్ బుఖారీబాబు, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల ప్రధాన కార్యదర్శులు పప్పల తిరుమలరావు, రావాడ అప్పలనాయుడు, రాజాం మండల శాఖ ప్రధాన కార్యదర్శి డోల వాసుదేవరావు, నల్ల రవికుమార్, రౌతు నరసింహప్పడు, బూరాడ పెంటన్నాయుడు, జి.సిగడాం మండల ప్రధాన కార్యదర్శి కె.వి.రమణ, వంగర మండల అధ్యక్షులు లావేటి గోవిందరావు,   ఎలకల భాస్కరరావు, దాసరి మహేష్, ఎందువ శీతన్నాయుడు, తూముల సూర్యారావు, ఎల్.ఆర్.కె., రమణ, వీరయ్య, భాస్కర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు