హలో పిల్లలూ! జుట్టు పైకి కట్టుకొని పరుగులు తీస్తున్న ఈ చిన్నారిని గమనించారా! నల్లగా తారు డబ్బాలో ముంచినట్లున్న ఈ అల్లరి ఓడుగును వేటితో తయారు చేశాననుకుంటున్నారు. బొప్పాయి విత్తనాలతో తయారు చేశాను. మిసిమి రంగు బొప్పాయికి ఈ నల్ల రంగు పిల్లలేమిటో! నేను ఈ బొప్పాయి పండుకు పొడుపు కథను రాశాను. మినీ కవితలు రాశాను. ఇప్పుడు ఈ గింజలతో అమ్మాయిని చేసేశాను. ఇవి నల్లగా ఉంటాయని ఆడపిల్లను చేయవద్దనుకున్నాను. కానీ ఇప్పుడు చేసేశాను. బొప్పాయి మధ్య అమెరికా, మెక్సికోలకు చెందిన పండు. ఇవి భారతదేశంలోకి ప్రవేశించి 400 ఏళ్ళు అయింది. దీని శాస్త్రీయ నామం "కారికా పపయా" ఇది'కారికేసి' కుటుంబానికి, ‘‘బ్రాసి కేలిస్’’ క్రమానికి చెందిన మొక్క. ఈ లబొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరెందులోనూ ఉండవు అని చెబుతారు. కడుపులోని ప్రేగుల్ని శుభ్రం చేస్తుంది. ప్రేగులు శుభ్రమైతే శరీరం మొత్తం శుభ్రంగా ఉన్నట్లే అంటారు. చాలా రకాలున్నా బొప్పాయిలో ముఖ్యమైనవి రెండే రకాలు. 1.డయోషియస్, 2.గైనో డయీషియస్. గైనో డయీషియస్ రకంలో గుజ్జు నారింజ రంగులో ఉంటుంది. డయీషియన్ రకంలో గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. పూసా జెయింట్ అనే రకాన్ని కూర తయారిలో వాడుతారు. బొప్పాయి కాయల పాలు సేకరించి "పపైన్' తయారు చేస్తారు. బొప్పాయి పండు తినడం వలన గర్భస్రావం అవుతుందనీ, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని! ఆపోహలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బొప్పాయి గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడుతారు. బొప్పాయి గుజ్జ శరీరానికి నిగారింపును ఇస్తుంది. సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు.
నల్లగం నిగనిగలాడే గుండ్రని బొప్పాయి గింజలతో నిగ్రో అమ్మాయి తయారయింది. బుట్ట చేతుల గౌను తొడుక్కుంది. కాళ్ళకు ఏమి వేసుకోలేదు. ఉత్తి కాళ్ళతో తిరుగుతోంది. నల్లగా ఉన్నానని అటు తిరిగి నిలబడి ముఖం చూపించనన్నది. చెవులకు పోగులు పెట్టుకున్నది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి