జలపాతం : - కోరాడ నరసింహా రావు!

 

జలపాతము ఎంత ఎత్తు నుండి కింద పడినా.... 
   ఏరులు , నదులుగా మారి  ... 
  పరీ వాహక మంతా 
పచ్చదనంతో నింపుతుంది... 
  దాహార్తిని దీర్చి , కడుపులు నింపు తుంది ! 

మనిషి పతనం చెందినా 
 పదిమందికీ...ఉప యోగ పడి... 
   ఆనందింప జేనమనే నీ తిని బోధిస్తుంది... 
    ఇదే కదా ప్రకృతి లోని గొప్పతనం...!! 
ఈ సమస్త ప్రకృతి త్యాగా న్నే బోధిస్తుంటే... 
   ఈ మనిషి మాత్రం ఎందుకో... 
 ఇంత స్వార్ధ పరుడై పోయాడు....!! 
      *****

కామెంట్‌లు