సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 ద్రోణుడు సుయోధనుడికి కవచధారణ విద్యను ఉపదేశించుట- 315 వ రోజు


అర్జునుడి పరాక్రమము చూసిన సుయోధనుడు ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నిన్ను లెక్క చేయక అర్జునుడు ముందుకు వెళ్ళి అందరిని చంపుతున్నాడు. మీరు చూస్తూ ఊరక ఉన్నారు. అర్జునుడి వంక కూడా చూడలేదు. తమరు నా కిచ్చిన వరం ఏమైనట్లు ? సైంధవుడు మిమ్ము నమ్మి ఎటూ పోకుండా రణరంగమున ఉన్నాడు. మీరు అతడిని రక్షించు ప్రయత్నము చేయ లేదు. అతడి చావు చూడాలని ఉందా. మీరు అసలు మనుషులేనా అని నాకు అనుమానంగా ఉంది . నా మనస్సు బాధపడుతుంది కనుక మిమ్మిలా అడుగుతున్నాను. సైంధవునికి రక్షణగా ఉన్న రధికులంతా పారి పోతున్నారు అతడిని రక్షించండి" అన్నాడు. ద్రోణుడు సుయోధనుడిని చూసి నవ్వి "సుయోధనా! నీ మాటలకు అశ్వత్థామ మాటలకు కోపిస్తానా! శ్రీకృష్ణుని తలపు కంటే అతడి గుర్రాలు వేగంగా పయనిస్తున్నాయి. అంతకంటే వేగంగా అర్జునుడి బాణాలు వెలువడుతున్నాయి. వాటిని ఆపగలిగిన శక్తి నాకు ఉందా! నేను ఈ స్థానం నుండి కదిలానంటే సైన్యం అల్లకల్లోలం ఔతుంది. ఆ పై సైంధవుని రక్షించుట కష్టం. కనుక నేను సేనా ముఖం నుండి కదలక ధర్మరాజును బంధించే ప్రయత్నం చేస్తాను. నేను వృద్ధుడిని కనుక అర్జునుడితో పరుగిడ లేను. నువ్వు అర్జునుడికి సమవయస్కుడవు కనుక అర్జునుడిని ఎదుర్కో " అన్నాడు. సుయోధనుడు " మిమ్ము కృతవర్మను ఎదుర్కొని దాటి వెళ్ళిన అర్జునుడిని ఎదుర్కొనుట నాకు సాధ్యమా! మీరు చెప్పారు కనుక వెళ్ళి పోరాడతాను " అన్నాడు. ఆ మాటకు సంతోషించి ద్రోణుడు " సుయోధనా ! నీకు కవచధారణ విద్యను నేర్పుతాను. దీనితో నువ్వు రక్షింపబడతావు. అర్జునుడు వేసిన శరములు నీ శరీరాన్ని తాకవు " అని ఒక బంగారు కవచం పై కవచధారణను ఆవహింప చేసి అది సుయోధనుడికి తొడుక్కోవడానికి ఇచ్చాడు. ద్రోణుడు " సుయోధనా! మొదట ఈ కవచ ధారణ విద్యను దేవతల సంరక్షణార్ధం బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చాడు. దేవేంద్రుడు దానిని అంగీరసునికి ఇచ్చాడు. అంగీరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివేశుడికి, అగ్నివేశుడు నాకు ఇచ్చాడు. నేను అది ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఇది ధరించి విజయుడివి కమ్ము " అని దీవించాడు. సుయోధనుడు కవచ ధారణ చేసి అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు.
కురుపాండవ యుద్ధము
కురు పాండవ సేనలు ఒకరికి ఒకరు తీసిపోకుండా ఘోరయుద్ధం చేస్తున్నారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొని కౌరవ సేనలను పీనుగుల కుప్పలుగా చేసాడు. ఎవ్వరికీ అతడి ముందు నిలవాడానికి ధైర్యం చాల లేదు. అది చూసి ద్రోణుడు పాంచాల కేకయ సేనలను ఎదుర్కొన్నాడు. అది చూసి ధర్మరాజు తన తమ్ములను తీసుకుని ధృష్టద్యుమ్నునికి సాయంగా వచ్చాడు. అది చూసి వికర్ణుడు వివిశంతిని, చిత్రసేనుడు భీముని, బాహ్లికుడు ఉపపాండవులను, దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవులని, సోమదత్తుడు శిఖండిని, అలంబసుడు ఘటోత్కచుని ఎదుర్కొన్నారు. శల్యుడు సైంధవుని పక్కనే ఉండి అతడిని రక్షిస్తూ అప్పుడప్పుడూ ధర్మరాజుపై బాణము వేస్తున్నాడు. దుశ్శాసనుడు సాత్యకిని మూర్ఛపోయేలా కొట్టాడు. కాని తేరుకున్న సాత్యకి దుశ్శాసనుడిని తరిమి తరిమి కొట్టారు. నకుల సహదేవుల పరాక్రమానికి తట్టుకోలేక శకుని ద్రోణుని వెనుక దాక్కున్నాడు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం