భావజల్లులు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


చుక్కల్లో చంద్రుడు 
తిరుగుతున్నాడు,
మనసుల్లో మాధుర్యాలు
నింపుతున్నాడు॥

తోటల్లో పువ్వులు
పూస్తున్నాయి,
గాల్లో పరిమళాలు
విరజిమ్ముతున్నాయి॥

ఆకాశంలో మబ్బులు
తేలుతున్నాయి,
చిటపటా చినుకులు
రాలుస్తున్నాయి॥

కడలిలో కెరటాలు
ఎగిసిపడుతున్నాయి,
కనులకు ఆనందాలు
చేకూరుస్తున్నాయి॥

తలల్లో ఆలోచనలు
పుడుతున్నాయి,
పుటలపై భావాలు
కొలువుతీరుతున్నాయి॥

పత్రికల్లో కవితలు
ప్రచురితమవుతున్నాయి,
పాఠకులకు పరవశాలు
పంచిపెడుతున్నాయి॥

.
కామెంట్‌లు