తమిళనాడులోని తూత్తుకుడి, తిరునెల్వేలి పరిధిలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించే కుక్కలలో ఓ జాతి పేరు కన్ని.
ఈ రకం కుక్కను అన్ని జాతులవారూ పెంచరు. ప్రత్యేకించి ఓ నిర్దుష్ట కులానికి చెందిన వారు మాత్రమే ఈ కన్ని కుక్కలను పెంచుతారు. ఈ కుక్కలను కొనడం అంత తేలికకాదు. సంబంధిత కులస్తుల వారికి ఈ కుక్కను పెంచుతున్నారంటే సమాజంలో వారికో హోదాగా భావిస్తారు. అందుకే ఈ కుక్కను ఇతర కులాలవారికి అడిగినా ఇవ్వరు.
ఇంట్లో కన్ని కుక్క పిల్లలను కన్నప్పుడు ఓ కుక్కపిల్లను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయికి కానుకగా ఇవ్వడం ఓ ఆనవాయితీ. మిగిలిన కుక్కపిల్లలను కళ్ళకు గంతలు కట్టుకుని బావిలో పడేస్తారు తప్ప డబ్బులిస్తాం మాకివ్వండి అని ఎవరైనా అడిగినా సరే ఇవ్వరు. తమ కులానికి చెందిన వారికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇతర కులస్తులకు ఇవ్వననివారి నుంచి మాట తీసుకుంటారు. అలా హామీ ఇచ్చిన వారికి మాత్రమే ఆ కుక్కపిల్లలను ఇస్తారు. తిరునల్వేలి తూత్తుకుడి ప్రాంతంలో కన్ని కుక్క జాతికి సంబంధించి ఇలాంటి ప్రత్యేకత ఉందన్నది ఆ ప్రాంతంలోని వారికే చాలామందికి తెలీదట.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి