ఈ జగత్తుకి మూలం సూర్యుడు. విశ్వమంతా వెలుగును ప్రసరిస్తూ జీవ కోటి ప్రాణాలను నిలబెడుతున్నది సూర్యుడు. వేడి, వర్షం, చలి ఇలా భూమ్మీద జరిగే ప్రతి క్రియకు సూర్యుడితో సంబంధం ఉంది. మరి అలాంటి సూర్యుడు అంతమైపోతే? అదేంటి సూర్యుడికి మరణం ఉందా అనుకోవద్దు. ఉంది. నక్షత్రాలు మరణిస్తాయన్నది తెలిసిన విషయమేగా. సూర్యుడు ఈ విశ్వంలోని అతి పెద్ద నక్షత్రం. ఇతర నక్షత్రాలు చనిపోతున్నట్టుగానే ఏదో ఒక రోజు సూర్యుడు శాశ్వతంగా అస్తమిస్తాడు. తన మరణానికి ముందు భూమ్మీద ఉన్న జీవరాశిని తన శక్తితో తుడిచిపెట్టేస్తాడంటున్నారు శాస్త్రవేత్తలు....
వయసై పోయాక సూర్యుడు ఓ భారీ రాయిగా మారిపోతాడన్నది శాస్త్రవేత్తల మాట. యాబై ఏళ్లుగా భూమికి మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో మరణించబోతున్న నక్షత్రాలపై బ్రిటన్ , కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గైయా స్పేస్ టెలిస్కోప్ ద్వారా వాటిని అధ్యయనం చేశారు. సాధారణంగా నక్షత్రాల్లో కార్బన్, ఆక్సిజన్ కలిసి మండుతుంటాయి. ఆ శక్తే మనకు భూమ్మీద నుంచి కాంతి మాదిరి కనిపిస్తుంది. వయసైపోయిన తర్వాత నక్షత్రాలు తొలుత కాంతిని కోల్పోతాయి. ఎలాంటి చర్యలు లేకపోవడంతో కొంతకాలానికి నక్షత్రం పూర్తిగా చల్లబడిపోతుంది. ఆ తర్వాత రాయిగా మారుతుందనేది ఎప్పటి నుంచో ఉన్న వాదన. శాస్త్రవేత్తలు గమనిస్తున్న మరణదశలోని నక్షత్రాలు కూడా క్రమంగా రాయిగా మారుతున్నట్లు తేలడంతో ఈ సిద్ధంతం సరైనదేనని తేలింది. ఈ ఫార్ములానే విశ్వంలోని అతి పెద్ద నక్షత్రం సూర్యుడికి వర్తింపజేసి, ఎప్పుడు మరణిస్తాడో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేశారు. దాదాపు వెయ్యి కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు చనిపోతాడని అంచనా వేస్తున్నారు. సూర్యుడిలో అత్యధికంగా హైడ్రోజన్ , హీలియం వంటి వాయువులు ఉన్నాయి. ఇవి జరిపే న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య వల్ల విశ్వానికి సరిపడేంత కాంతి వస్తోంది. వయసు పెరిగేకొద్దీ ఈ కాంతి తగ్గుతూ, చివరకు సూర్యు డు చల్లబడిపోయి పెద్ద వైట్ డ్వార్ఫ్ గా మారిపోతాడని సైంటిస్టులు అంటున్నారు. ప్రస్తుతం సూర్యుడు ‘ఎల్లో డ్వార్ఫ్ ’ స్టేజ్ లో ఉన్నాడట. వచ్చే ఐదు బిలియన్ సంవత్సరాల్లో చల్లబడుతూ తొలుత ‘రెడ్ డ్వార్ఫ్’గానూ, ఆ తర్వాత వైట్ డ్వార్ఫ్ గానూ మారిపోతాడని వివరించారు. ఆ తర్వాత కొన్ నేళ్లకు పూర్తి రాయిగా మారతాడని చెబుతున్నారు. ఈ రాయిలో ఎక్కు వగా వాయువుల పరిమాణం ఉండటం వల్ల లోహంలా మెరుస్తూ కనపడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా, వచ్చే అఅయిదు వందల కోట్ల ఏళ్లలో సూర్యుడు వందల రెట్లు పెరిగిపోతాడట. ఈ దశను ‘రెడ్ జెయింట్ స్టార్’ అని పిలుస్తారు. కొంతకాలానికి మెల్లగా సూర్యుడి నుంచి వాయువులు విడుదల కావడం మొదలవుతుందట. ఇది సగానికిపైగా సూర్యుడిని కప్పేస్తుందట. ఈ దశ దాటితే తొలుత సూర్యుడి అంతర్భాగం ‘వైట్ డ్వార్ఫ్ ’గా మారిపోతుందట. ఇలా కొన్ని వేల ఏళ్ల పాటు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇది సౌర కుటుంబంలో పెద్ద మార్పులకు దారి తీయొచ్చనేది సైంటిస్టుల అంచనా వేస్తున్నారు. అయితే కచ్చితంగా ఇదే జరుగుతుందని వాళ్లు చెప్పలేకపోతున్నారు. సూర్యుడు పెరిగే కొద్ది , వేడి పెరిగి భూమిపై జీవరాశి అంతరించిపోతుందని అంటున్నారు. చివరకు భూమి అంతర్భాగం ఒక్కటే మిగలొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి