మహారాజు విభ్రాంతికి లోనయ్యెను
అతడు రామవిరహముతో దూరషిల్లుచు
స్పృహను కోల్పోయి నేలపై పడిపోయెను
కౌసల్యా, సుమిత్రా పతిచెంతకొచ్చి
ఆ మహారాజును లేవనెత్తినారు
ఆయనను కూర్చోబెట్టి ఇలా అంటారు
ఓ మహాత్మా! రాజ్యాధికారము త్యజించి
వనములకు వెళ్ళుట దుష్కరకార్యము
ఓ పతిదేవా! కైక ఇచ్చటలేదు భీతిచెందకు
శ్రీరాముని గూర్చి మంత్రినడిగి తెలుసుకో
రాజుతో అంటూ కౌసల్యాదేవి మూర్చిల్లెను
మూర్ఛిల్లిన కౌసల్యను మహారాజు చూచి
బాధతో అతడు మిక్కిలి దుఃఖించెను
అచ్చటకి చేరినవారు ఆమె చుట్టు మూగి
ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చినారు
అంతఃపురమున అర్ధనాధములను
నగరము లోని ప్రజలంతా విని
బోరున ఏడుస్తూ విలపిస్తున్నారు
ఆ నగరము శోకసాగరమున మునిగెను
====================================
అయోధ్యకాండము నందు 57వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి