స్నిగ్దారెడ్డి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్న పోతురాజు
 స్నిగ్దారెడ్డి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న పోతురాజు.

 తెలుగు సాహితీ వనం తొమ్మిదవ వార్షిక మహోత్సవం సందర్భంగా హైదరాబాదు రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్నిగ్దారెడ్డి బాల సాహిత్య పురస్కారాన్ని సత్తుపల్లి బాల సాహిత్య రచయిత ఆవుల పోతురాజు స్వీకరిం
చారు.తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి,డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ తదితరుల సమక్షంలో ఈ పురస్కారాన్ని నిర్వాహకులు అందచేశారు. 
      పేద కుటుంబంలో జన్మించి చదువుతోపాటు బాల సాహిత్యంలో పోతురాజు చేస్తున్న కృషికి అతిధులు ప్రశంసలు అందచేశారు.
పన్నెండు వేల రూపాయల సహాయం
          నిరుపేద వర్గానికి చెందిన పోతురాజు చదువు నిమిత్తం వేదిక నుండి పన్నెండు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అతిధులు అందచేశారు. పోతురాజు ప్రతిభను గుర్తించి సాహిత్య రచనకు ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయిని రమాదేవి వెంకటాచార్యులును ఈ సందర్భంగా అభినందించారు.
అభినందనల వెల్లువ
      రవీంద్రభారతిలో ఆవుల పోతురాజు స్నిగ్దారెడ్డి సాహిత్య పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా  పలు సంస్థలు ప్రముఖులు ప్రశంసలు అందచేసారు.సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ రాగమయి,ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్,ప్రముఖ సాహితీ వేత్త గరిపల్లి అశోక్, గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు,సృజన నిర్వాహకులు వాసు,ఆడమ్స్,నాగేశ్వరరావు, అయ్యదేవర శేషగిరి,మాదిరాజు మాలతి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు కేశవరెడ్డి, ప్రకాశరావు,రామిశెట్టి సుబ్బారావు, డి.కృష్ణయ్య,నర్సయ్య,బూరుగు దాసు తదితరులు ప్రశంసలు అందచేసిన వారిలో ఉన్నారు.
కామెంట్‌లు