సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం


 సామెత-284: ఇంటి దేవరను ఇగిలించబెట్టి -బయటి దేవరకు బోనమెత్తి నట్టు

**
"ఏందో అవ్వా! మడుసులు గిట్లయ్యిండ్రేంది. పెద్దా శిన్న లేదు. ఓ బాద్దెత లేదు. ఇది నా ఇల్లు. ఇండ్ల మడుసులు, నా వోళ్ళు అన్న సోయి లేదు. శిన్నతనాన పెద్దోళ్ళు ఎన్నెన్ని కట్టాలు బడి పెంచిర్రు. గియ్యాల తిండికి బట్టకి ఎస్మంటి బాద లేకుండ బత్కడానికి ఎన్కాల ఎవలున్నరు అన్న జ్యాసే లేదు. లోకం పురాగ శెడిపొయ్యిందవ్వా! మంచి శెబర అన్నీ మట్లె గల్శినయి. గిదంత సూత్తుంటే మస్తు బయమైతుందవ్వా? గీ పెపంచకంల మడుసులేంది గిట్లయ్యిర్రు తల్సుకుంటె అద్దమ్మ రేతిరి యాదికొచ్చి కంటిమీద రెప్ప పడట్లే."
 ఏంది శెల్లే? గంత యిశారంగ ఎప్పుడు లెవ్వు. ఎవలన్న ఏవన్న అన్నరా ఏంది? "
ఎవ్వలు ఏమనుడు గాదుగని అవ్వా! నీకు నాకు వొయిసు పెర్గుతుందా లేదా మనం మన అవ్వ అయ్యల్లెక్క, తాత నాయినమ్మల్లెక్క ముస్లోల్లం అయితమా లేదా?"
"గదేంది శెల్లే! గిదెవలికి తెల్వని యిష్యం లెక్క శెప్తున్నవ్. పుట్టినోడు పుట్టినట్టే ఎట్లుంటడు సెప్పు.కదలకుండ ఓ సోట పెర్గే శెట్టులో సుత వొయిసు తేడా లొత్తయి." 
" గదే అవ్వా!శెట్టుల్ల తేడలొచ్చినా మడిషిలో తేడా లొచ్చినా శెట్టిలువ ఏడికి బోద్ది.మడిషి యిల్వ యాడికి బోద్ది.పోవొద్దు గద. గింత వొయిసొచ్చే దన్క సాకి సంబాళిచ్చిన మడుసుల్ని మర్శిపోతె,గాళ్ళని సరింగ సూడకపోతె ఎట్టుంటది శెప్పు."
 నిజమే శెల్లే!గట్ల జేత్తే మస్తు బాదయిద్ధి. ఇంటోళ్ళకిచ్చే మరియాద, గవురవం ఇంటోళ్ళకి యియ్యాలె.గాళ్ళని మంచిగ అర్సుకోవాలె. గస్మంటిది గట్ల జేసిందెవలు?గింతకీ ఎవలి ముచ్చెటి శెల్లే?"
 "గదేనవ్వా! మన అయిలయ్య మావఁ కొడ్కు బిచ్చమయ్య ఉండు గద.గా మావ రెక్కల కట్టంతోనేగా బిచ్చమయ్య మావఁ పెర్గి ఊల్లె గిప్పుడు పెద్ద ఆసామి లెక్క పెత్తనాలు,పెద్దిర్కం శేత్తుండు. శేత్తే సేశిండు గని గదేం పని  ఇంట్లె అమ్మ నాయినల్ని మంచిగ సూడొద్దా శెప్పవ్వా? గాల్లు తినేదే పిడ్కెడు మెతుకులు.గది సుత గీళ్ళు తినడానికి వొండుకునే దాంట్లె పిడికెడు మెతుకులు గంతే.గది సుత పెట్టడానికి సత్తుర్రు."
గాల్లెవలో దూరపు సుట్టాలకు,బయిటోళ్ళకి మాత్తరం ఏడేడి వొంటలు బగారిచ్చిన కోడి కూరలు సేసి పెట్టుడు.ఇంట్లె పెద్దోళ్ళకి మాడ్శిన కారం ,మిలిగిన అన్నం వెట్టుడు. గది సుత గాళ్ళు ఆకల్కి నకనకలాడ్తుంటే.గదంత సూశి, ఆకలి బాదను అనుబగించి గా యిద్దరు " మాకీ కర్మేంది.గింత సంపాయిచ్చినం,తిండికి సత్తున్నం "అని తల్కాయ గొట్టుకుంటుర్రు.
" గదేంది శెల్లే? గట్ల జేసుడు.మాగనే వుంది కథ ఎన్కట మన పెద్దవాళ్ళు గిస్మంటోళ్ళని జూసే గీ సామెత అనేటోళ్ళు."
 "  ఏ సామెత అవ్వా?జెల్ది శెప్పు గిస్మంటోళ్ళ గురించి సుత సామెతుందా?"
 అవును శెల్లే! " ఇంటి దేవరను ఇగిలించబెట్టి -బయటి దేవరకు బోనమెత్తి నట్టు "శేత్తుర్రు. గట్ల పెద్దోళ్ళను యింస బెట్టుడు ఏంది శెల్లే?"
 "అవునవ్వా!  మంచిగ శెప్పినవ్ దేవుళ్ళ ముచ్చెట్లను మడుసులకు పోలుత్తూ... అయితే గదేందో ఇంకొక్క పాలి శెప్పవ్వా!"
" గదే శెల్లే ఇంటి దేవరను ఇగిలించబెట్టుడు అంటే ఇంటోళ్ళని సరింగ సూడకుండ ఆకలిని పట్టిచ్చుకోకుండ ఉండుడు. గదే సుట్టంగ వొచ్చినోళ్ళకో ,బయిటోళ్ళకో ఎక్కల్లేని మరియాద ఇచ్చి అర్సుకునుడు. గిదెక్కడి అన్న్యాలం శెప్పు."
 "ఇంట్లె బెట్టుకున్న దేవతకి పూజలు పునస్కారాలు శెయ్యకుండ బయిటి దేవతకు నైవేద్దంగా బోనాలెత్తుడు" ఇంటోళ్ళకి కోపమొచ్చినా గట్ల జేసేటోళ్ళకి మంచి జర్గదు.గట్లనే ఇంట్లె దేవతను పెట్టుకొని పట్టిచ్చుకోకున్నా బాగుండదని అర్తం శెల్లే!"
"గదండీ సంగతీ! ఇంటి దేవరను ఇగిలించబెట్టి- బయిట దేవరకు బోనమెత్తినట్టు"  అంటే గిదే మరి.
కామెంట్‌లు