నరరూప రాక్షసుల అంతమెప్పుడు?: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - సెయింట్ లూయిస్ - అమెరికా.


తెలిసి తెలియని వయస్సే 
లోక స్వభావం తెలియని చిన్నారియే 
మాయమాటలు చెప్పి మోసగించి 
బలవంతాన తీసుకెళ్ళి 
హోటల్ యాజమాన్యంతో కుమ్మక్కై 
నరరూప రాక్షసుల కన్నా ఎక్కువగా 
ముప్పై మంది పైగా అత్యాచారం చేసినపుడు
ఆమె పడిన నరకయాతన వర్ణనాతీతం 
ఆమెలో  మీ కన్న కూతురైన, తోడబుట్టిన చెల్లి అయినా కనబడలేదా
కామంతో కళ్ళు మూసుకున్న  నరహంతకులను 
వీధిలో నగ్నంగా తిప్పి
నడి రోడ్డులో ప్రజల ముందు ఉరితీయడమే అసలయిన శిక్ష 
విజ్ఞులు ప్రాజ్ఞులు ఆలోచించండి
తప్పు చేస్తే దండన ఉంటుందన్న భయం ఉంటేనే 
దేశప్రగతి జరుగుతుంది..!

(పదమూడేళ్ళ చిన్నారిపై. రాజస్థాన్  గంగానగర్ లో ఐదు రోజుల పాటు హోటల్ యాజమాన్యం సహాయంతో అత్యాచారం చేసిన వార్త విని ఆర్ద్రతతో వ్రాసినది)
..................................

కామెంట్‌లు