సోషల్ మీడియాలో యువతే దే హవా!
రీల్స్ మీద హీరో, హీరోయిన్లు
ఇన్‌స్టాలో హల్చల్ ఇది ఒక పార్శ్వం...
ప్రేమ సంబంధిత కేసుల్లో...
హత్యల్లో...డ్రగ్స్ లో మాఫియాలో
నిత్య కొత్త కేసులు....
నేటి యువత పరిస్థితి...
అగమ్య గోచరంగా మారింది.
అయితే కుటుంబ పెద్ద దీనికి
బాధ్యుడు. ఆయనే తండ్రి
నాన్న, బాపు, డాడీ, పప్ప
పేరు ఏదైనా అతను ఒకే ఒకడు.
అతని ద్వారానే సమాజ నిర్మాణం.
నాన్న ఒక పవిత్ర పదం, అది ఇపుడు ఒక రోజు పరిమితం అయిపోయింది. ఫేస్ బుక్ వాట్స్ అప్ లో, నాన్న తో దిగిన ఫోటో
పెట్టి చప్పట్లు కొట్టడం కాదు.
జీవితం ఉన్నంత వరకు నాన్న అందరిలో ఉంటాడు. నువ్వు ఎంత ఉన్నత స్థానం లో ఉన్నా నీ సర్టిఫికెట్ లో ఆయన పేరు అచ్చులో ఉంటుంది. నీ నాన్నదే ఆ క్రెడిట్ అంతా.
ఆధునిక యుగం లో నాన్న పాత్ర
చాలా పరిమితం అయిపోయింది.
వస్తు సంస్కృతికి పిల్ల వాడు అతుక్కు పోయాడు. ఉద్యోగ ఉద్వేగం పోలికలు వెరసి
*నాన్నఅనేఉద్యోగం* గా మారిపోయి అంతరాంతరాలలో
ఎక్కడో అసంత్రుప్తి చోటు చేసుకుంది.
అయితే నాన్న లో అంతరార్థం ఏమిటి? ఎవరు మంచి నాన్న.
లోనికి వెళితే... ప్రస్తుత జెంజి తరం లో ఆయన ఓడిపోతున్నాడా? గెలుస్తున్నాడా? పక్కన పెడితే
ఆలోచనలో మాత్రం పడిపోయాడు.
తండ్రి అంటే ఒక ధర్మం
పితృ స్వామిక వ్యవస్థలో నాన్న ఒక కేంద్ర బిందువు. ఆయన ఆలోచనల మీద కుటుంబ రైలు నడుస్తుంది
తండ్రి అంటే నీకు రెక్కలు ఇవ్వడానికి తన కలలను కత్తిరించుకునేవాడు .
నీకు భవిష్యత్తు ఇవ్వడానికి తన వర్తమానాన్ని తాకట్టు పెట్టేవాడు. తండ్రి అంటే ఒక ఏ.టీ.ఎం మిషన్ కాదు. కామదేనువు, కల్పవృక్షము అంతకన్నా కాదు. తండ్రి అంటే ఒక ప్రత్యేక వ్యక్తిత్వం.
ఉపనిషత్తు తండ్రి ధర్మం గురించి ఇలా చెప్తుంది.
పితా జనహిత ,పితా గురువు జన్మనీయడమే కాదు. మొట్టమొదటి గురువు కూడా అతడే. ధర్మాన్ని చెప్పడం అతని బాధ్యత.
కటోపనిషత్తులో యముడు తండ్రి వాజశ్రవసుడి నుండి వచ్చిన శాపం వల్ల నచకేతుడికి బ్రహ్మ జ్ఞానం దొరికింది అంటే సంస్కారాన్ని నాటే వాడే తండ్రి.
ప్రస్తుత తరానికి వస్తే కొంత ధర్మాన్ని నాటడంలో తండ్రి వెనుకబడ్డాడని చెప్పక తప్పదు.
దీనికి కారణం ప్రపంచీకరణ ,
నూతన వస్తు సంస్కృతి.
ఇంకా లోతుల్లోకి వెళితే.. ఋగ్వేదం, మనుస్మృతి, ఉపనిషత్తుల ఆధారంగా తండ్రి అయిదు ధర్మాన్ని పాటించాలి.
మొదటిది పుత్రోత్పత్తి ధర్మం
మంచి కొడుకును సమాజానికి అందించడం. ఇప్పుడంతా ప్రణాళిక బద్దంగా పిల్లలకు జన్మనియడమే.
రెండవది నామకరణ ధర్మం... పితాపుత్రస్య నామధేయం
(బృహదారణ్యకోపనిషత్ 6.4.25&1.5.17) పేరు పెట్టడం
అంటే ఒక తరానికన్న ముందు వెళ్ళినప్పుడు పేర్లు సత్యానికో, ధర్మానికో, ప్రతీకలుగా నిలబడేవి.
అలాగే దేవుళ్ల పేర్లు పెట్టి వారి గొప్పతనాన్ని చెప్పి దానిని నిలుపుకోమని చెప్పేవారు.
కాలం మారింది. భాషా సంస్కృతి మారాక పేర్లు మారాయి. గూగుల్ మీద ఆధార పడ్డ తండ్రి
ఇప్పుడు అగుపిస్తున్నాడు.
విద్యా ధర్మం... (చాందగోపనిషత్ 4.4)
ప్రకారం చక్కటి విద్యను పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ఇవాళ నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ వారి వారి తాహత్ మీద అడ్మిషన్లు ఇప్పిచ్చి తాము గొప్ప చదువులను అందించామని సంతృప్తిని పొందుతున్నారు.
పిల్లవాడిని ఒత్తిడికి గురి చేస్తున్నారు తప్ప పిల్లవాడి ఎదుగుదల వికాసానికి సంబంధించిన అంశాల ప్రాధాన్యత చర్చ లేకుండా పోయింది.
తండ్రి ధర్మం ప్రకారం కొడుకుకు సత్యాన్ని అందించాల్సిన వాడు. కానీ ఉద్యోగరీత్యా తండ్రి, తల్లి ఇద్దరు సంపాదనలో వెళ్లిన క్రమంలో పిల్లవాడు తో మాట్లాడే సమయం లేదు. టచ్ లేకపోతే
పిల్లవాడికి ప్రేరణే లేదు.
ధర్మోపదేశ ధర్మం
(తైతరినియోపనిషత్ 1.11.1)
సత్యం, ధర్మాన్ని నడిచే విధానాన్ని తెలిపాల్సినవాడు తండ్రి ...
ఇక్కడ దశరథున్ని తీసుకున్నట్లయితే, ఆయన తమ కుమారులకు సత్య, ధర్మ ప్రబోధ చేయడమే కాకుండా, ఆచరణ చేసి చూపాడు. అలాగే మునుల ద్వారా ఋషుల ద్వారా ఆశ్రమాలకు పంపి, ధర్మాచరణను, జీవితంలో ఎలా అన్వయించుకోవాలో, అభ్యసించాలో తెలిపిన గొప్ప తండ్రి.
అలాగే భారతంలో చూస్తే ధృతరాష్ట్రుడు, కౌరవులకు సరైన ధర్మ ప్రబోధ చేయకపోవడం, మార్గదర్శకత్వం చేయలేకపోవడం వల్లనే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిoది. జీవితానికి అర్థం నేర్పే వాడే నిజమైన తండ్రి.
రక్షణ ధర్మం పితా రక్షితా
(అధర్వవేదం 7.14.1.)
తండ్రి కొడుక్కి కవచం లాంటివాడు. ఆపదలో ఆదుకునే వాడు తప్పు చేస్తే దండించేవాడు.
నచికేతుడి తండ్రి వాజశ్రవసుడు కోపంతో యముడికి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ శాపమే నచికేతుడికి బ్రహ్మజ్ఞానాన్ని తెచ్చిపెట్టింది.
అప్పుడప్పుడు కోపం వల్ల తండ్రి అనే మాటలు మంచికి కూడా దారితీస్తాయి అని ఇది చెబుతుంది.
శ్రీకృష్ణుని నందుడు కంసునుండి రక్షించడం కోసం తాను అవస్థపడి యమునను దాటించి నందునికి అప్పగించి రక్షణ అనే బాధ్యతకు ప్రతీకగా నిలబడ్డాడు.
పితుహు క్రోధః పుత్రస్య వర్ధనః
తండ్రి కొట్టినా,తిట్టినా, కొడుకు మంచి కోసం, వృద్ధి కోసమే.
అయితే ఇక్కడ ,తండ్రి స్థానంలో ఉన్న అతను తన తండ్రి ప్రవర్తించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు. ఆ తరంతో పోల్చుకున్నవాడు.
అందువల్ల ప్రస్తుత పిల్లల్లో ఎవరు క్రోధాన్ని చూపించే ప్రయత్నం చేయడం లేదు. దీనికి కారణం సింగిల్ పేరెంట్ కావడం ఒకటి.
పిల్లల మీద మాస్ మీడియా ప్రభావంతో అనర్థాలకు దారితీస్తాయని భయాన్ని తండ్రి
కలిగి ఉన్నాడు. నాన్న ఉన్నాడు అని ధైర్యం పిల్లలకు పెద్దలకు బలాన్ని కలిగించాలని,ఆధునిక కౌన్సిలర్స్ కూడా తెలియజేస్తున్నారు.
క్రమశిక్షణ discipline విషయానికి వస్తే, తండ్రి ప్రేమతో మాత్రమే ఈరోజు పిల్లలకు చెప్పాల్సి వస్తుంది.
విలువలను నేర్పే తండ్రి కావాలి ఆధునిక సమాజంలో. అనర్థాలన్నింటికీ మూలమైనటువంటిది సమాజంలో విలువలు పడిపోవడమే. ఒక రాముడు నడిచి తమ విలువని ప్రపంచానికి తెలియజేశాడు.
ఈ వేళ ఆధునిక తండ్రి పోలికల మధ్యన నలిగిపోతున్నాడు. తాత ,అమ్మమ్మ, నానమ్మలు లేక వ్యష్టి కుటుంబాలుగా మారినాక
సమన్వయ పరిచేవారు లేకుండా పోయారు.
కాబట్టి తాను సరైనని దిశా నిర్దేశనాన్ని చేయడంలో తండ్రి కాస్త వెనకబడి పోయాడని చెప్పడానికి తప్పడం లేదు.
మానసిక స్థిరత్వానికి బిందువుగా నిలబడి
తండ్రి పాత్రను పోషించినప్పుడు
ఉద్వేగాలకు ఎక్కడా స్థానం లేదు. క్షణికావేశాలకు గురయ్యే సందర్భాలు రావు.
ఒక నాన్న ప్రశాంతం కుటుంబ ప్రశాంతం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి