సుందరకాండము ) 🪷 1వ సర్గ 🪷: - ఎడ్ల లక్ష్మి
హనుమంతుడు సముద్రమును దాటుట, మైనాకుని స్వాగతము, సురసను జయించుట , సింహకావధ, లంక శోభన్ గాంచుట. 




జాంబవంతుని ప్రేరణతో ఆంజనేయుడు 
సీత యొక్క జాడను అన్వేషించుటకై 
దివ్య జాతుల వారు సంచరించు 
ఆకాశమార్గమున వెళ్ళుటకు సిద్ధపడెను 

మారుతి అంగదాదివానరులతో ఇట్లనెను 
రామబాణము వలె వేగముగా 
రావణుడేలేటి లంకకు వెళ్ళెదను 
సీతాదేవిని తీసుకొని వచ్చెదను 

తోడి వానరులతో ఇట్లు పలికిన పిదప 
అతివేగముగా ఆకాశమున ఎగిరెను 
అతని వెంట కొంత దూరము వరకు 
వానరప్రముఖులు కొందరు అనుసరించిరి

ఆకాశమున తేలిపోవుచున్న 
వాయుపుత్రుని యొక్క వాలము 
మహోన్నతముగా నిలిచి పైకి ఎత్తబడిన 
ఇంద్రధ్వజమువలె శోబిల్లుచుండెను

పొడవైన వాలముతో ఉత్తరదిశ నుండి 
దక్షిణ దిశకు సాగిపోవు చుండెను 
అతడు సూర్యుని వలె ఒప్పుచుండెను 
అతని నీడ సముద్రంలో ప్రతిబింబించుచుండెను
కామెంట్‌లు