ఒకటవ సర్గ : ( 3 ): - ఎడ్ల లక్ష్మి


ఆ మైనాక పర్వతము మంచి మనసుతో 
మానవ రూపమును ధరించి 
తన శిఖరముపై నిలిచి పైనుండి వెళ్తున్న 
కపివీరుని సమీపించి ఇట్లనెను

ఓ వానరోత్తమా! నీవు అలిసిపోతివేమో? 
నా శిఖర ప్రదేశముల యందు నిలిచి 
హాయిగా కొంత కాలము విశ్రమింపుము 
జలది రఘువంశాజులచే వృద్ధి చెందినది 

రామకార్యముకై సిద్దపడిన నీకు 
సాగరుడు 
అతిథిసపర్యలు చేయదలచినాడు 
అతడు ఇచ్చేటి ఆతిథ్యమును 
నీవు స్వీకరించినచో అతనికి సంతోషము 

ఓ హనుమా! మేము నిన్ను పూజించినచో 
వాయుదేవుని పూజించినట్లే 
అందుకని నీవు నాకు పూజ్యుడవు 
కొంతసేపు నాపై విశ్రమించుము

ఓ పూజ్యుడా! పూర్వకాలము 
పర్వతమునకు రెక్కలు ఉండేడివి
అవి గరుడవేగముతో అన్ని దిక్కులకు 
హాయిగా సంచరించుచుండెవి
కామెంట్‌లు