మానవ జీవన, ఆది !సుందరజీవనసౌధ పునాది!కాలం ,నాటిన జీవనవిత్తు!ఎదుగు, వృక్షమంతఎత్తు !బాల్యస్మృతి చూపు జీవనగతి!దేశ వనరులు, బాలబాలికలు!వెలికి తీస్తే, భావిదేశఏలికలు!వారే మనదేశ నిజ సంపత్తు !వారేఎదుర్కొను జనఆపత్తు!ఈవామనులే, త్రివిక్రములు!పిల్లల్ని గాలికి వదిలేయడం,సామాజిక నేరం!నిర్లక్ష్యం చేస్తే వారే ,దేశానికి, మోయలేని భారం!అనాథ బాలల నాథులు,నిస్సంతు అమ్మానాన్నలు!సాకే కన్నవారు లేకున్నా,ప్రేమగా పెంచేవారుంటే!బాలకృష్ణులందరూ,భావిలో పురుషోత్తములే!బాల్యం తలుచుకున్నప్పుడల్లా,మనిషి ఆనందం ఉప్పొంగాలి!జీవన పుస్తకం మొదటి పేజీలు,చివరిదాకా చదివించాలి !బాల్యం చిదిమేయబడిందని,నీడలా వెంటాడే భావన!ఎదగడానికి అవరోధం,ఎదురు తిరిగే అవకాశం!జీవనరాగం బాల్యం పల్లవి,చరణాలు పలుకు పెదవి!నేటి బాలలే రేపటి పౌరులు,ఓ నినాదమా?మానవి ప్రగతి సాధన,సరి (సం)విధానము!బాలల ఆరోగ్యమేదేశ మహాభాగ్యం!మేధో వికాసమే ,ప్రతి మాసం, మధుమాసం!నేటి భారత బాలల,బతుకు భావిభారతం కొరకు!_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి