పూలు భలే అందంగా రోజూ మా ఇంట్లో పూల కుండిలోకి వచ్చేవి.ఇలా చాలా కాలంగా చూస్తున్న కవికి మెదడు తొలిచింది. ఇంకేముంది కలం కాగితం లేని చేతులు ఎగిరి గంతేసే.చలి వానల చిక్కిన జవరాలి మనసు ఆ పూలను అల్లుకుంది.అంతే నాట్య భంగిమలో గాలిగంధాలు వీచింది.చూస్తే అందమైన పూల జలకాల నటనలు ఇలా మనను బంధించింది.ఒక క్షణం యవ్వన వసంతాన్ని పిలిచిన ప్రకృతి ఒడిలో వాలిన మనిషితో పాటు అడవి జీవాలన్నీ కోరస్ పాడిన వసంత యామిని కళ్ళలో కంజీర నాదాల జ్ఞాపకాల సవ్వడి ఇలా ఇలా...చలో చలో అంటూ...ఊగని మనసు లేదు జతగలువని పద యుగళం లేదు అద్భుత మధుర యుగళగీతంలో ఇల...
ఈ పూలు చలివానలో
*******
పులకరించిన పూలు
చిలకరించిన చినుకు తడి
పలకరించిన చలిలో
ముసుగేసిన దుప్పటి బాల
రెండూ కలిసిన వేళ
ఆగిన మరనో లేక
సలలిత రాగ సుధా రస సార స్వప్న సుందరో...
డా.టి.రాధాకృష్ణమాచార్యులు<
9849305871
26-11-26
చిత్ర సౌజన్యం: డా.కె.ఎల్.వి.ప్రసాద్
నుడి కథ: డా.టి.ఆర్.కె.చార్యులు
కురిసిన కవిత:
డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి