అమ్మమ్మ తాతయ్య ఈ కార్తీక సోమవారం నాడు నేను మిమ్మల్ని ఇద్దరిని గంట దూరంలో ఉన్న సెయింట్ లూయిస్ బాలాజీ దేవాలయానికి తీసుకువెళ్తాను అక్కడే శివుడు పార్వతి మహాలక్ష్మి దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు నీకు ఇష్టమైన షిరిడి సాయిబాబా అందరు ఉంటారని మనుమడు ప్రదీప్ జానకమ్మ తో చెప్పాడు తాతయ్య నువ్వేమి నడవక్కరలేదు అన్ని దేవుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉంటాయి అని డెబ్బై ఏళ్ళు దాటి నలభై సంవత్సరాలు అధ్యాపకునిగా పనిచేసే హెడ్మాస్టర్ గా రిటైర్ అయిన రామారావు గారితో మనుమడు చెప్పాడు.
వెంటనే మాకేమంత వయసు అయిపోయింది అందులోకి కార్తీక మాస సోమవారం నాడు దగ్గరుండి చక్కగా తీసుకెళ్తావంటే తాతయ్య నేను తప్పక వస్తాం తాతయ్య సంధ్యావందనం త్వరగా పూర్తి చేసుకుని తొమ్మిదవ గంటకి బయలుదేరి వెళదాం కానీ ఉష్ణోగ్రత ఈ రెండు డిగ్రీలే ఉంది చల్లగా ఉంటుందో ఏంటో అన్నారు జానకమ్మ.
అమ్మమ్మ మొన్న వాల్‌మార్ట్ లో కొన్న జాకెట్లు ఇద్దరు ధరించండి ఇంకా ముందు ముందు మరీ చల్లబడి మంచు పడుతుంది. అందుకే మొదటివారం వెళదాం అంటున్నాను అని చెప్పాడు తప్పకుండా వస్తాము నువ్వు దగ్గరుండి తీసుకెళుతున్నామంటే రాకుండా ఉంటామా అన్నారు జానకమ్మగారు
సోమవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం కాలమాన పరిస్థితులను బట్టి వేడి నీటితో చేసి జానకమ్మ కార్తీక దీపం పెట్టి తరువాత తాతయ్య సంధ్యా వందనం పూర్తయ్యాక జాకెట్లు ధరించి రెండుచుక్కల పసుపు నీళ్ళు జల్లుకు మనుమడు ప్రదీప్ తో కలిసి సెయింట్ లూయిస్ బాలాజీ దేవాలయానికి వెళ్ళారు
అక్కడ గణపతి దత్తాత్రేయుడు మహాలక్ష్మి మొదలగు దేవుళ్ళను దర్శించి శివాభిషేకం గోత్ర నామాలతో చేసుకుని
రుద్ర సూక్తపఠనం నమక చమకాలతో
నమః శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయాచ శివతరాయాచ
అని చెప్పి నీరాజన మంత్ర పుష్ప పఠనం చేసి ప్రసాదం తీసుకుని ఎంతో సంతోషంగా ఉందిరా ఇంతమంది చలిలో కూడా వచ్చి లింగార్చన చేయడం నాకు నచ్చింది అని మనుమడు ప్రదీప్ తో అంటే .ఏమనుకున్నావు ఇక్కడ మనదేశంలో జరిగే పండుగలు క్రతువులు అన్ని జరుగుతాయి. ఆది శంకరులు చెప్పినట్లు అన్ని వర్ణాల వారు కూడా పాల్గొంటారు అన్నాడు
ఒరే ప్రదీప్ అందరు పరమేశ్వర ప్రతి రూపాలే భగవంతుడు సర్వాంతర్యామి నాకు బాగా నచ్చింది. పవిత్ర కార్తీక మాసంలో ఎలా చలి దానికి తోడు దేవాలయం లో పూజలు ఎలా ఉంటాయో అని భయం వేసింది. చెప్పొద్దు ఇక్కడ కూడా చాలా బాగా చేశారని చెబితే
ప్రదీప్ దేవాలయం బయట తాతయ్యకు నీకు ఛాయాచిత్రం తీస్తాను అని తీసి చూపించిన మనుమడునిఆప్యాయంగా తీసుకు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు ..!
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి