సామెత-423: ఉత్త చేతులతో మూర వేసినట్లు
***
"వామ్మో! గాడు అట్టాంటిట్టాంటోడు గాదవ్వా!మా కాలాంతకుడు. మాటల్తో బురిడి కొట్టిత్తడు.ఏదో శేత్తున్నట్టు కనికట్టు శేత్తడు. గాడు దేవున్ని సుత మాయ జేసి నమ్మిత్తడు.గసుమంటోని సోపతి బట్టినమా!ఇంగ నిండా మునిగినట్టే అవ్వా!."
"ఎవలు శెల్లే గంత మాయలోడు? ఏం జేసిండేంది? అయిన గని యివతలోల్లు గంత అమాయికత్తంగున్నరా? గదేంది దేవుడు సుత మోస పోతడంటున్నవ్?"
"అవునవ్వా! ఎన్కట మా శాలుగాడైన నసిరుద్దీను అనేటాయిన కతలు వినేటోల్లం,ఆచ్చిర పోయేటోళ్ళం సూడు.గాయిన లెక్కనే గీడు సుత శేత్తడవ్వా?"
'ఏందీ బలే గమ్మతిగుంది శెల్లే! ఇంతకీ ఎవలో శెప్పకనే పోతివి? గీ నడ్మల మడుసులు శానా శానా వుషారు పిట్టలైతుర్రు తీ! ఎవ్వల్ని మందలిచ్చ వొశం కాట్లే."
"గాడే అవ్వా! కోటి లింగం.నీకు సుత తెల్సు.యాది మర్శినవట్టున్నవ్. గా నసీరుద్దీను అనేటాయిన ఓ పాలి దేవునికి ముడ్పు శెల్లిత్తననీ ,వొద్దంటే తీస్కుంటనని పదిమంది ముంగల ముడ్పు పైసల మూట బయిట నిల్సుని పైకి ఎగిరేత్తడు.గది కింద పడంగనే దేవుడు తీసుకోట్లేదు.గందుకే నేను తీస్కుంటున్న అంటడు సూడు గట్లన్న మాట."
అవును శెల్లే! గాయిన కతలు మా నవ్విత్తయి.గదేందబ్బా అని యిశారిచ్చేటట్టు సుత శేత్తుంటయి."
"అగ్గో గట్లనే గీ కోటి లింగం గాడు.ఎన్కటెవలో శిటికెల పందిరి ఏశి దేవున్నే తెల్ల బోయేతట్టు సేశిండట గద .గా కత నీకు తెల్సా అవ్వా?"
"ఎందుకు తెల్వదు శెల్లే? గది తల్సుకున్నప్పుడల్లా గా మడిషెవలో గని మస్తు శాలూగాడు అనిపిత్తది. గాయినంట దేవుడ్ని అది గావాలె,ఇది గావాలె అన్కుంట కోరబట్టిండంట.దేవుడు ఇన్పిచ్చుకోనట్టుంటే శిటికెల పందిరి కట్టిత్త అన్నడంట.గదెంత మంచిగుంటదో శిత్రమైన కానిక ఇత్తుండు గీ బకుతుడు అన్కొని కోరినయల్లా తీర్సుకుంట వచ్చిండంట. ఓ దినం శిటికెల పందిరి కట్టిత్తవా? లేదా? లేకుంటే ఏమైతదో తెల్సుగద అనే తల్కి,గా బకుతుడు గదెంత పాటి సామీ? ఎప్పుడంటే అప్పుడు కట్టిత్త అన్నడంట. గా శిత్రమేందో సూడ్డానికి ఊల్లె జనమంత గా బకుతుడున్న సోటికి వొయ్యిర్రు."
ఇంగ గీ బకుతుడు గా దేవుని యిగ్రం ఎదురుంగ నిలవడి శిటికెల పందిరి ఎత్తున్న సూడుర్రి అన్కుంట.శేత్‌తో శిటికెలేస్కుంట ఇగ్గో గియ్యి తంబాలు,ఇగ్గో గియ్యి పైన వాసాలు,అగ్గో ఆపైన పందిరి అన్కుంట శెప్పబట్టిండంట. గజ్జూసి ఊల్లె జెనాలు "అమ్మనీ గీని తెల్వి అమ్మగాను,గీడు మామూలోడు కాదురా బై" అన్కుంట ఒక్క తీర్గ నగుకుంట ఎల్లి పోయిండ్రంట. ఇంగ గా దేవుడైతే "ఓర్నీ! వొరాలిచ్చే నన్నే బురిడీ గొట్టిచ్చినవేరా. గా పేరే కొత్తంగుంది.ఇంగ పందిరెంత కొత్త కొత్తగుంటదో అన్కున్ననని, గాని తెల్వి తేటల్కి ఆచ్చిర బోయిండంట."
"అగ్గో అవ్వా! నువ్వు శెప్పినట్టే అచ్చు గుద్దిండు గీ కోటి లింగం గాడు. రకరకాల యాపారాల్తో బాటు గుడి తాన పూల దండల యాపారం మొదలు వెట్టిండంట."
" అంటే అన్ని సోట్ల శేసినట్టే మాల కొల్శేతాన సుత మోసం జేత్తుండన్న మాట. గందుకే గిసుమంటోళ్ళని సూశే మన పెద్దోళ్ళు"ఉత్త శేతులతో మూరేశినట్టు "శేత్తుండనే శాత్రంతో పోల్శిర్రు శెల్లే!"
"అవునవ్వా! నువ్వన్న మాట అచ్చర సత్తెం.గాడు శేసేది అదే.తియ్యంగ మాట్లాడుడు,నమ్మినంక మోసం జేసుడు."
"గదండీ సంగతి! "ఉత్త చేతులతో మూర వేసినట్లు" అంటే గిదే మరి. మాటల్తో,శేతల్తో ఎదుటోల్లని మాయ జేసుడన్న మాట.గస్మంటోళ్ళు మన సుట్టుకొందరుంటరుల్లా. జెర జాగర్తగుండుర్రి మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి