బరువు..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


ఆశయాలను గమ్యాలను మనము మోస్తాము. 
విషాదాలను వివాదాలను కుట్రలు కుతంత్రాలను 
విష వలయాలను విషయాలను మోస్తాము మనం. 
విచారాలను సమాచారాలను ఆచారాలను ధర్మాలను 
సంస్కృతిని విష సంస్కృతిని మోస్తాము మనం.!!?

చరిత్రలను జీవిత చరిత్రలను పవిత్ర పండగలను 
జయంతులను వర్దంతులను మోస్తాము మనం. 
ఇవి ఎంతో బరువైనవి కానీ బరువే లేని 
విజ్ఞాన శాస్త్రాలను శాస్త్రీయతను సిద్ధాంతాలను 
ఆదర్శాలను ఆలోచనలను చైతన్యాన్ని మార్పును 
మనం మోయం.!!!?

నిజంగా ఆలోచనలు బరువైనవైతే 
నలిగిపోతాం వంగి పోతాం ఓడిపోతాం 
పడిపోతాం. 

మన శరీరాన్ని మనం మోసినట్లు 
మన తలను మనం మోసినట్లు 
దాని బరివే తెలియనట్లు మన తలలోని ఆలోచనల 
బరువే మనకు తెలియదు తెలిస్తే అలసిపోతాం ఆగిపోతాం...!!!
=======================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
సూపర్