*పీస్ అంబాసిడర్ గా చిటికెన కిరణ్ కుమార్*

 

అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు.. శాంతి, మానవతా విలువలకు విశేష గౌరవం
 పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు  ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, సంపాదకీయ కాలమిస్టు చిటికెన కిరణ్ కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన వరల్డ్ సిటిజన్ పీస్ అంబాసిడర్స్ సెంటర్ ఆయనను ప్రపంచ పౌరుల శాంతి రాయబారిగా గుర్తించింది.
          2026 నవంబర్‌లో సభ్యత్వ నమోదు చేసుకున్న ఆయనకు సంస్థ ఇటీవల ఈ-మెయిల్ ద్వారా స్వాగత సందేశంతోపాటు గుర్తింపు పత్రాన్ని అందించింది.         అమెరికాలోని ఈ సంస్థ ప్రపంచశాంతి, మానవతా విలువలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, భిన్నత్వానికి గౌరవం వంటి ఆశయాలను అంతర్జాతీయంగా ప్రోత్సహిస్తోంది. సంస్థ డైరెక్టర్ జూలీ లిల్లీ సంతకంతో అందించిన ప్రశంసాపత్రం కిరణ్ కుమార్‌కు శాంతి, మానవతా విలువల పట్ల ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా నిలిచింది.
           సాహిత్య సామాజిక రాజకీయ అంశాలపై వందకు పైగా పత్రికల్లో వేలాది రచనలు రసించుతూ  ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై, విభినార్లలో కూడా  శాంతి, సామరస్యం, మానవతా విలువలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో చిటికెన కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం (ఐ బి ఆర్ ఎఫ్) గౌరవ సభ్యులుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్, రిస్టోరేషన్ ఆఫ్ లైట్  ( హెచ్ డబ్ల్యు పి ఎల్ ) నిర్వహించిన ప్రపంచ శాంతి సదస్సులో ఐ బి ఆర్ ఎఫ్ తరఫున భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. శాంతియుత సమాజ నిర్మాణంలో ప్రతి వ్యక్తి పాత్ర కీలకమనే సందేశాన్ని ఈ వేదికపై ప్రస్తావించారు. జపాన్‌లోని క్యుషు విశ్వవిద్యాలయం నిర్వహించిన నాగసాకి శాంతి, నిరాయుధీకరణ వెబ్‌నార్‌లోనూ పాల్గొన్నారు. అంతర్జాతీయ సాంస్కృతిక, దౌత్య సంబంధాల సదస్సులో శ్రీలంక ప్రతినిధుల చేతుల మీదుగా గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్స్ అవార్డు ( యు ఎన్ ఐ సి సి డి ఆర్ )ను అందుకున్నారు.
సాహిత్యాన్ని సామాజిక చైతన్యానికి, మానవీయ విలువల పరిరక్షణకు సాధనంగా భావించే కిరణ్ కుమార్ 'మనమంతా ఒక్కటే' అనే సందేశంతో విశ్వశాంతి, సోదరభావం, సామాజిక ఐక్యతను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తున్నారు. ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా సాహిత్య సేవలందిస్తున్న ఆయనకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపుపై పలువురు సాహితీవేత్తలు, రచయితలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
కామెంట్‌లు