రాజస్థాన్ లోని సాస్ బహూ మందిర్ గాపిల్వబడే ఆలయం ఉదయపూర్ కి 20కి.మీ.దూరంలో ఉన్న నాగదా అనే పల్లెలో ఉంది.ఇది ఒకప్పుడు మేవాడ్ ప్రాచీన రాజధాని.ఆరావళీ పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయం11వశతాబ్దిలో మేవాడ్ రాణా మహీపాల్ కట్టించాడు.అతనిభార్య విష్ణుభక్తురాలు. అందుకోసం సహస్రబాహు ఆలయం కట్టించాడు.అతని కోడలు శివ భక్తురాలు కావటంతో అక్కడే ఓచిన్న శివాలయం కట్టించాడు.కానీ సాస్ బహూ అన్న పేరు ఎందుకొచ్చిందీ!? సహస్రబాహు మందిర్ అన్న పేరు కాలక్రమేణ జనంనోట నాని చితికి సాస్ బహూ ఐంది! అత్త కోడలు పేరు కాదు,సహస్రబాహు కి వచ్చిన తిప్పలు! పెద్ద ఆలయాన్ని సాస్ (అత్త) చిన్న దాన్నిబహూ(కోడలు) అనిపిలవటంతో అదే స్థిర పడింది. ఇక వాస్తుకళ శిల్పసంపద అద్భుతం!ఈనాటి టెక్నిక్ లేకున్నా ఆశిల్పులు కళాకారుల చాతుర్యం ప్రతిభ నభూతో నభవిష్యతి! చరిత్ర సంస్కృతి,ప్రకృతిఅందాలు ఆకట్టుకుంటాయి. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం చేశారు విదేశీయులు! అందుకే పూజాపునస్కారాలు ఉండవు.కానీ చరిత్ర కు సాక్షిగా అద్భుత శిల్పసంపద కు నిలయంగా ఈప్రదేశం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది🌷
అత్తా కోడలు ఆలయం!: - ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి