స్వర్ణాలంకార శోభితుడు! : - పాలగుమ్మి జ్యోతి.

 

తిరుపతిలో కొలువు 
ఏడుకొండలు నెలవు 
సర్వమునందుగలవు 
ఆపదలను కాచేవు 
వజ్రమకుటధర గోవిందా!!

కుబేరుడుతో ఒప్పందం 
పద్మావతితో వివాహం
అప్పుకు నీవు కాదతీతం 
తీరలేదు ఆ ఋణభారం 
వజ్రమకుటధర గోవిందా!!

తలనీలాలు అర్పితం 
లడ్డు ప్రసాదం పవిత్రం 
నిత్యం అన్న ప్రసాదం 
నీదు మహిమ అద్భుతం
వజ్రమకుటధర గోవిందా!!

గోవింద నామ స్మరణము 
మారుమ్రోగు ప్రదేశము 
కలియుగ వైకుంఠము
చూచిన జన్మ ధన్యము
వజ్రమకుటధర గోవిందా!!

కామెంట్‌లు